విధాత: ఇటీల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఓ అనువాద తమిళ చిత్రం ఆణ్ పావం పొల్లాతతు (Aan Paavam Pollathathu) ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. గత నెలలో తమిళనాట విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్నే సాధించింది. థియేటరికల్ రన్ ముగిశాక ఇటీవల ఈ చిత్రాన్ని తమిళంలో పాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకు రాగా వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మగవాళ్లు, కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఓన్ చేసుకుంటున్నారు. మా జీవితాలను నిఝంగా కళ్లకు కట్టినట్లు చూపించారని సినిమా మేకర్స్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అందులోని సన్నివేశాలను సోషల్ మీడియాల్లో తెగ షేర్ చేస్తున్నారు.
రెండేండ్ల క్రితం జో అనే తమిళ సినిమాతో కుర్రకారు హృదయాలను దోచేసిన జంట రియో రాజ్, మలయాళీ బ్యూటీ మాళవిక మనోజ్ ఈ చిత్రంలో మరోమారు కలిసి నటించి ఆకట్టుకుఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న శివ, శక్తి అనే జంట సిటీలో ప్రత్యేకంగా కాపురం స్టార్ట్ చేస్తారు. అయితే తన భార్య శక్తి అప్పటివరకు తండ్రి పెంపకంలో చాలా కఠిన పద్దతులలో పెరిగిందనితెలుసుకున్న భర్త ఇక సొంత ఇంట్లో ఇష్ట ప్రకారం ఉండమని చెబుతాడు. అడిగిందల్లా, తెచ్చేవాడు, చేసేవాడు. అయితే అదే అలుసు కావడంతో శక్తి ఇంటి పనులు కూడా చేయడం మానేస్తుంది. అడిగితే ఇట్స్ మై ఛాయిస్ అంటూ చెబుతూ ఉంటుంది. ఇది కాస్త అంతకంతకు పెరిగి విడాకులు తీసుకునే వరకు వస్తారు.
అయితే.. శక్తి లాయర్ లక్ష్మి ఫెమినిస్ట్ కావడంతో తన వద్దకు వచ్చే మహిళలకు అనుకూలంగా మగవారిపై లేని పోని కేసులు పెట్టించి వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడేలా చేస్తుంటుంది. అదే సమయంలో శివ కేసును లక్ష్మి భర్త టేకప్ చేసి శివను కాపాడుతుంటాడు. ఈ నేపథ్యంలో వీరి కేసు ఏ దరికి చేరింది. జడ్జి ఎదుట ఎలాంటి వాద ప్రతివాదనలు జరిగాయనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఫన్ ఇస్తూనే నేటి సమాజంలో తప్పులేకున్నా మగ వాళ్లపై ఆడవాళ్లు పెట్టే కేసులు ఎలా ఉంటున్నాయి, సోషల్ మీడియా ఏం చేస్తుంది అనే పాయింట్‌ను సరిగ్గా డీల్ చేశారు. ఆడవాళ్ల బిహేవియర్‌ను కళ్లకు కట్టినట్లు ప్రజంట్ చేశారు. ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు, మంచి టైంఫాస్ సినిమా కావాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.
