హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకి, దక్షిణాది అడ్వర్టైజింగ్ రంగంకి మరింత చేరువయ్యే లక్ష్యంతో జియోస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి దశ రీజనల్ రోడ్‌షోని హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రాంతీయ కంటెంట్ ప్రాముఖ్యత, వినియోగదారుల అభిప్రాయాలు, టీవీ, డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్రాండ్లకు నెట్‌వర్క్ ఎలా తోడ్పడుతుందో ఈ కార్యక్రమం వివరించింది. జియోస్టార్ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో ఇలాంటి ఈవెంట్‌లు నిర్వహించడానికి దీనితో శ్రీకారం చుట్టింది.
కంటెంట్ వ్యూహం..
జియోస్టార్ హెడ్ (రెవెన్యూ, ఎంటర్‌టైన్‌మెంట్ & ఇంటర్నేషనల్) అజిత్ వర్గీస్ మాట్లాడుతూ, “స్థానిక సంస్కృతులు, మారుతున్న కస్టమర్ల అభిరుచులకి అనుగుణంగా మేము ఆకట్టుకునే కథలని రూపొందిస్తున్నాము. స్టార్ మా ఛానెల్స్, జియోహాట్‌స్టార్‌లోని మా తెలుగు కంటెంట్‌కి వస్తున్న ఆదరణ, ప్రాంతీయంగా ప్రేక్షకులకి మా బలమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రోడ్‌షోతో మా భాగస్వాములని నేరుగా కలిసాం. ప్రాంతీయ విశేషాలని పంచుకున్నాం. జియోస్టార్‌తో వచ్చే అపరిమిత ప్రయోజనాల గురించి వివరించాం” అని తెలిపారు.
ఈ రోడ్‌షోలో భాగంగా టీవీ, డిజిటల్ మాధ్యమాలలో నెట్‌వర్క్ కంటెంట్ వ్యూహం, పనితీరు, విజయగాథలని వివరించారు. మార్కెట్ అవగాహన, సరైన సందేశాన్ని భారీ స్థాయిలో ప్రజలకి చేర్చడంలో జియోస్టార్ అనుభవంతో బ్రాండ్లు ఎలా ప్రయోజనం పొందగలవో ఈ కార్యక్రమం తెలియజేసింది. ప్రముఖ నటులు, హోస్ట్‌లు శ్రీముఖి, బిగ్ బాస్ ఫేమ్ అవినాష్, స్టార్ మా ఫేమ్ ప్రభాకర్, ఆమని, నేత్ర, అర్జున్ కల్యాణ్, నిరుపమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విస్తృత పరిధి, అవకాశాలు..
జియోస్టార్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో స్టార్ మా, స్టార్ మా HD, స్టార్ మా మూవీస్ SD మరియు HD, స్టార్ మా గోల్డ్, స్టార్ మా మ్యూజిక్, జియోహాట్‌స్టార్ ఉన్నాయి. ఇవి ప్రతి నెలా ప్రాంతీయంగా 90 శాతం మందిని చేరుకుంటున్నాయి. ప్రైమ్ టైమ్‌లో ‘గుండె నిండా గుడి గంటలు’, ‘కార్తీక దీపం’ వంటి ఫిక్షన్ షోలతో పాటు ‘ఇస్మార్ట్ జోడీ సీజన్ 3’, ‘కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్’ వంటి నాన్-ఫిక్షన్ కంటెంట్‌కి భారీ వ్యూయర్‌షిప్ లభిస్తోంది. ‘బిగ్ బాస్’ వంటి కంటెంట్ 7.5 కోట్ల వ్యూయర్‌లకి (తెలుగు మాట్లాడే మార్కెట్‌లో 84 శాతం మందికి) చేరింది. జూన్ 28న ప్రవేశపెట్టబోయే రియాలిటీ షో ‘కుక్ విత్ జాతిరత్నాలు’తో ప్రోగ్రామ్ లైనప్ మరింత పటిష్టం కానుంది.
వినియోగదారులపై నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం, 98 శాతం టీవీ వినియోగం, పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో వినియోగాలలో అత్యంత తక్కువ అంతరాలతో దక్షిణాదిలో టీవీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్టార్ మా ఛానెల్స్ ప్రతి నెలా తెలుగు మాట్లాడే వారిలో 90 శాతం మందికి చేరుకుంటున్నాయి. ప్రజలలో తమ గురించి అవగాహన పెంచుకోవడానికి బ్రాండ్లకి ఇది విశిష్టమైన అవకాశంగా నిలుస్తుంది. 24,000 గంటల పైగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్, 1,800 పైచిలుకు టైటిల్స్‌తో జియోహాట్‌స్టార్‌కి దేశంలోనే అత్యధిక స్థాయిలో తెలుగు కంటెంట్ లైబ్రరీ ఉంది.
తెలుగు మాట్లాడే మార్కెట్లలో ప్రభావవంతంగా ప్రజలకి చేరాలని కోరుకుంటున్న బ్రాండ్లకి స్మార్ట్ కంటెంట్, భారీ విస్తృతి గల జియోహాట్‌స్టార్ కీలక గమ్యస్థానంగా నిలవగలదు. సీఎంఆర్ షాపింగ్ మాల్, మహారాణి దాల్ మిల్, అంబికా ఆరోమా, స్నేహా ఫ్రెష్ చికెన్, కేఫ్ నిలోఫర్ వంటి బ్రాండ్లు వ్యూహాత్మకమైన, ఒక మోస్తరు పెట్టుబడులతో స్టార్ మా, జియోహాట్‌స్టార్ ద్వారా గణనీయంగా ప్రచార ప్రభావాన్ని పొందాయి. భారీ ఫలితాలు సాధించేందుకు భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఇది నిరూపిస్తుంది. ప్రాంతీయ మీడియా, అడ్వర్టైజింగ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో బ్రాండ్లు తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి జియోస్టార్ గణనీయంగా తోడ్పాటు అందించగలదు.