న్యూఢిల్లీ : అఫ్ఘానిస్తాన్ (Afghanistan)తూర్పు పాక్టికా ప్రావిన్స్ లో పాక్ వైమానిక దళం(Pakistan airstrike) జరిపిన దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు(Three Afghan cricketers) సహా 8మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు వచ్చే నెలలో పాక్, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్ సిరీస్ కోసం అఫ్గాన్‌లోని ఉర్గాన్ నుంచి శరనకు వెళ్లారు. పాక్ దాడిలో తమ క్రికెటర్లు మృతి చెందడాన్ని నిరసిస్తూ..వచ్చే నెల పాకిస్తాన్, శ్రీలంక జట్లతో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అఫ్గాన్ క్రికెటర్లు కబీర్ అఘా, సిబాతుల్లా, హరూన్ మృతి అఫ్గాన్ క్రికెట్ కు తీరని లోటు అని ఏసీబీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేసింది. గాయపడిన ఆఫ్ఘాన్ పౌరులు కోలుకోవాలని ఆకాంక్షించింది.