షహరాన్‌పూర్, అక్టోబరు 13- ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో దారుల్ ఉలూమ్ దియోబంద్‌ను సందర్శించడానికి వచ్చిన ఆఫ్గన్ తాలిబన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీకి ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి గౌరవ వందనం లభించింది. సిగ్గులేకుండా తాలిబన్‌లను సమర్థిస్తున్నారంటూ సమాజ్‌వాది పార్టీని విమర్శించే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడేమంటారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య దియోబంద్‌కు చేరిన ముత్తాఖీకి ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ముత్తాఖీ జమాయత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్శద్ మదానీని, అనేక మంది ఇస్లామిక్ పండితులను కలిశారు. ఆయనకు ఈ సందర్భంగా ఇస్లామిక్ సంప్రదాయంలో హాదిత్ సనద్(ఆశీర్వచనం) లభించింది. తన పర్యటన భారత-ఆఫ్గన్ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ముత్తాఖీ ఈ సందర్భంగా అన్నారు.
Taliban Foreign Minister Visits Darul Uloom Deoband | తాలిబన్ ముత్తాఖీకి గౌరవ వందనం
షహరాన్‌పూర్‌లోని దారుల్ ఉలూమ్ దియోబంద్‌ను సందర్శించడానికి వచ్చిన తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీకి యూపీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

Latest News
సక్సెస్తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
మొసలి పట్టుకు అడవి దున్న హంఫట్
ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం..వందలాది మంది మృతి
వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన
చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ ..