విధాత : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అభిమానులకు ఆయన పుట్టిన రోజు(Birth day) సందర్భంగా విశ్వంభర(Vishwambhara) మూవీ టీమ్ ఢబుల్ ధమాకా అందించింది. నిన్న విశ్వంభర నుంచి గ్లింప్స్ విడుదల చేసిన యూవీ క్రియేషన్స్(UV Creations) నేడు చిరు పుట్టిన రోజు వేడుక సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేసింది. విశ్వంభరలోని ఓ పాటలో డ్యాన్స్ స్టెప్ వేస్తున్న చిరు వింటేజ్ లుక్ తో కూడిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విశ్వంభర మూవీ హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో నిర్మాణం జరుపుకుంటూ విజువల్ వండర్ గా ప్రేక్షకులను అలరించబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికలుగా త్రిష, అషికా రంగనాథ్, కునాల్ కపూర్ నటిస్తున్నారు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు సహా పలువురు మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులైతే కేక్ కటింగ్ లు, రక్తదానాలు, హెల్త్ క్యాంపులతో సందడి చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.