Revanth Reddy| సభకు రా..చర్చిద్దాం : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండలకు కృష్ణా జలాల్లో అన్యాయం చేసిందే కేసీఆర్ అని..దీనిపై అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించమంటే బ‌హిరంగ స‌భ‌ల‌కు వెళ్తాన‌ని అంటున్నాడని, .. ప్రతిపక్షనేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2నుంచి అసెంబ్లీ ఏర్పాటు చేసుకుందామని, కృష్ణా న‌ది జ‌లాల పైన ఒక రోజు, గోదావ‌రి జ‌లాల‌పైన ఒక రోజు అసెంబ్లీలో చ‌ర్చ‌కు మేం సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండలకు కృష్ణా జలాల్లో అన్యాయం చేసిందే కేసీఆర్(KCR) అని..దీనిపై అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించమంటేబ‌హిరంగ స‌భ‌ల‌కు వెళ్తాన‌ని అంటున్నాడని, .. ప్రతిపక్షనేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2నుంచి అసెంబ్లీ ఏర్పాటు చేసుకుందామని, కృష్ణా న‌ది జ‌లాల పైన ఒక రోజు, గోదావ‌రి జ‌లాల‌పైన ఒక రోజు అసెంబ్లీలో చ‌ర్చ‌కు మేం సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వ‌స్తే గౌర‌వంగా చూసుకుంటాం…నాది బాధ్య‌త అని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్, స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఫ‌లితాల..త‌ర్వాత కేసీఆర్ కు త‌న ప్ర‌తిప‌క్ష హోదా గుర్తుకు వ‌చ్చిందన్నారు. కేసీఆర్ జంకు లేకుండా రంకు మాట‌లు మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు రాజ‌కీయ బిక్ష పెట్టిందే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అని, అటువంటి జిల్లాకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. స‌మైక్య రాష్ట్రంలో కంటే కేసీఆరే తెలంగాణ కు తీర‌ని అన్యాయం చేశాడన్నారు. కేసీఆర్ హ‌యాంలోనే జ‌ల‌దోపిడి జ‌రిగిందని, కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీల‌కు కేసీఆర్ సంతకం పెట్టి మ‌ర‌ణ‌శాస‌నం రాశాడని మండిపడ్డారు. మూడు జిల్లాల‌పైన కేసీఆర్ మ‌ర‌ణశాస‌నం రాశాడని, కృష్ణా జ‌లాల‌పైన శాశ్వ‌తంగా ఎపీకి హ‌క్కులు రాసి ఇచ్చాడని, పాల‌మూరు రంగారెడ్డి కి జూరాల నుంచి కాకుండా శ్రీశైలంపై నుంచి నీళ్లు తీసుకోవ‌డం ద్వారా అన్యాయం చేశాడని..ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టులను పడకేయించాడు

పోతిరెడ్డి, ముచ్చుమ‌ర్రి లాంటి ప్రాజెక్టుల‌ను ఎపీ నిర్మించుకుంటున్నా కేసీఆర్ ప‌ట్టించుకోలేదని, 10 ఏళ్ల‌లో సాగునీటి ప్రాజెక్టు ల‌పైన 2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాడు.. 1.80 ల‌క్ష‌ల కోట్ల బిల్లులు చెల్లించాడని, ప‌దేళ్ల‌లో ఒక్క ప్రాజెక్టును కూడా కేసీఆర్ పూర్తి చేయ‌లేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎస్ ఎల్ బీసీ , డిండి , క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, భీమా, పాల‌మూరు రంగారెడ్డి ఇలా ఏ ప్రాజెక్టు పూర్తి చేయ‌లేదు అని, సంగంబండ‌లో బండ ప‌గ‌ల‌కొట్ట‌డానికి క‌నీసం 12 కోట్లు కూడా విడుద‌ల చేయ‌లేదు అని, క‌ల్వ‌కుర్తి లో భూసేక‌ర‌ణకు డబ్బులు ఇవ్వ‌లేదు అన్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్రాజెక్టు ల‌పైన 6800 కోట్లు ఖ‌ర్చు చేశాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు

తెలంగాణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ స‌ర్వ‌నాశనం చేశాడని, ఆర్థిక ఉగ్ర‌వాది కేసీఆర్ అని..ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైన అత్యాచారం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.8.11లక్షల కోట్ల అప్పులు చేశాడని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కమిషన్లతో దోచుకున్నాడన్నారు. మేం వచ్చాక అధిక వడ్డీ అప్పులను చెల్లిస్తూ రూ.4వేల కోట్ల భారం తగ్గించామయన్నారు. కేసీఆర్ పాల‌మూరు రంగారెడ్డి డీపీఆర్ కూడా స‌రిగా త‌యారు చేయ‌క‌పోవ‌డంతో కేంద్రం వెన‌క్కి పంపిందని, అది కూడా కేసీఆర్ పాలన కాలం 2023ఎప్రిల్ లోనే వెనక్కి వచ్చిందన్నారు. 45 టీఎంసీలు మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల నుంచి ,మ‌రో 45 టీఎంసీ లు ప‌ట్టిసీమ నీళ్లు వాడుకుంటామ‌ని చెప్పారని, పాల‌మూరు రంగారెడ్డి పైన ఎన్ జీ టీలో కేసులు వేసింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డికి కొల్లాపూర్ లో టిక్కెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించార. కృష్ణా జ‌లాల్లో ఎపీకి 64 శాతం, తెలంగాణ‌కు 29 శాతం వాటాకు కేసీఆర్ సంత‌కం చేశారని, కేసీఆర్ క‌మిష‌న్ల‌కు అమ్ముడుపోయి త‌క్కువ వాటాకు అంగీక‌రించాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కొడుకు, అల్లుడు పంచాయతీతోనే బయటికి వచ్చాడు

బీఆర్ఎస్ లో కొడుకు, అల్లుడు కొట్లాడుకుంటున్నారని, అల్లుడు చేతికి పార్టీ పోతుంద‌న్న భ‌యంతోనే కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు అని, గోదావ‌రి జ‌లాల‌ను రాయ‌ల‌సీమ త‌ర‌లించుకుపోమ్మ‌ని చెప్పింది ఎవ‌రో అసెంబ్లీలో తేల్చుదాం అని రేవంత్ రెడ్డి అన్నారు. స‌భ‌కు రాకుండా కేసీఆర్ మోహం చాటేస్తున్నాడు అని, కొడుకు కుర్చీ కోసం, అల్లుడు ఆస్తుల కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారని, లోక్ స‌భ‌, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నిక‌లు పార్టీ సింబ‌ల్స్ పైనే జ‌రిగాయి క‌దా..? అని మరి అందులో బీఆర్ఎస్ ఎందుకు ప్రజాతిరస్కరణకు గురైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పైన నిజ‌నిర్దార‌ణ క‌మిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్లి ప‌రిశీలిద్దాం..ఏ పార్టీ గెలిచిందో తెలుస్తుందన్నారు. కేసీఆర్ వ‌య‌సుకు నేను గౌర‌వం ఇస్తున్నానని, కేసీఆర్ క్రియాశీల‌క రాజ‌కీయాల్లో లేరు.. చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి పాత్ర పోషిస్తేనే క్రియాశీల‌కంగా ఉన్న‌ట్లు అన్నారు. త‌మ‌ల‌పాకుతో న‌న్ను ఒక‌టి అంటే నేను త‌లుపు చెక్క‌తో ఒక‌టి ఇస్తానన్నారు.
ప‌దేళ్ల‌లో కేసీఆర్ కాంగ్రెస్ క‌ట్టిన‌ ఓఆర్ఆర్ తో పాటు భూముల‌ను అమ్ముకున్న ఘనుడు కేసీఆర్ అని, హైద‌రాబాద్ లో ఏం చేశారో కేసీఆర్ ఒక్క‌టి చూపించాలని, కృష్ణా జ‌లాలో త‌క్కువ వాటాకు అంగీక‌రిస్తు సంత‌కం చేసిన కేసీఆర్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్ష‌మాప‌ణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 299 టీఎంసీల్లో తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన వాటాను వాడుకోలేదు అని,
ఎస్ ఎల్ బీసీ లాంటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తే ఎక్కువ నీళ్లు తీసుకునే అవ‌కాశం ఉండేదన్నారు.

కూలేశ్వరం లేకపోయినా వరి దిగుబడిలో రికార్డు

కాళేశ్వ‌రం కూలేశ్వ‌రం అయినా వ‌రి ఉత్ప‌త్తిలో తెలంగాణ ను నెంబ‌ర్ 1 గా నిల‌బెట్టాం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వ‌రి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నాడు అని, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ లో ఐర‌న్ లెగ్.. హ‌రీష్ రావును అధ్య‌క్షుడిని చేయాల‌ని ప్ర‌చారం చేస్తున్నారని, కేసీఆర్ ఉన్నంత కాలం హ‌రీష్ రావు ఎక్క‌డికి పోడు అని, కేసీఆర్ త‌ర్వాత పార్టీని చేజిక్కించుకోవాల‌ని హ‌రీష్ రావు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీతో పాటు 5000 వేల కోట్ల పార్టీ ఆస్తుల‌పైన హ‌రీష్ రావు క‌న్నేశాడన్నారు. పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు అని, కేసీఆర్ కుటుంబ‌మే క‌విత‌ను పార్టీ బ‌య‌టేసిందన్నారు. నేను కోటి మంది మ‌హిళ‌ల‌కు చీరె, సారే ఇస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం క‌విత కు చీరే ,సారే ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని బ‌య‌ట‌కు నెట్టేశారు అని ఎద్దేవా చేశారు. యూరియా కోసం టెక్నాల‌జీ ని వాడిని కేసీఆర్ భ‌రించ‌లేక‌పోతున్నాడు అని, మోదీ త‌న ఆరోగ్యం గురించి ఆరా తీయ‌గానే కేసీఆర్ సంతోష‌ప‌డుతున్నాడని, ఫార్ములా ఈ రేస్ కేసు లో అర్వింద్ కుమార్ విచార‌ణకు డీవో పీటీ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదేనన్నారు.

Latest News