India-Vs-Westindies-2nd-Test| వెస్డిండీస్ పై భారత్ 7వికెట్లతో ఘన విజయం

ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ భారత్ 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది.

విధాత : ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులోZ(india-vs-westindies-2nd-test) భారత్ 7 వికెట్లతో(India beats West Indies by 7 wickets) విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ భారత్ 2-0 తో క్లీన్ స్వీప్(Clean Sweep) చేసింది. 121 పరుగుల లక్ష చేధనకు మ్యాచ్ ఆఖరి రోజు 63/1 తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 హాఫ్ సెంచరీ నాటౌట్ తో రాణించాడు. దృవ్ జురెల్ 6నాటౌట్ గా ఉన్నాడు. సాయి సుదర్శన్ 39 పరుగులకు అవుటవ్వగా, కెప్టెన్ గిల్ 13పరుగులు అవుటయ్యాడు. నాల్గవ రోజు ఆటలో మరో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 9పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 5వికెట్లకు 518 పరుగులకు డిక్లెర్ చేసింది. యశస్వీ జైస్వాల్ 175, కెప్టెన్ గిల్ 129 నాటౌట్, దృవ్ జురెల్ 44, నితీష్ రెడ్డి 43 రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248పరుగులకు అలౌట్ అయ్యింది. 270పరుగుల లోటులో ఫాల్ ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లను సమర్దంగా ఎదుర్కోంది. కాంప్ బెల్ 115, షైన్ హోప్ 103 సెంచరీలతో రాణించారు. జస్టిస్ గ్రీన్స్ 50, రోస్టన్ చేజ్ 40, జైడెన్ సీల్స్ 32 రాణించడంతో విండీస్390పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో 121 పరుగుల టార్గెట్ ను చేదించేందుకు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన భారత్ మూడు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది.