Accident | లక్నో : అతి వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం ఓ యువకుడి( Youth ) నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రైలు పట్టాలను( Railway Track ) అతి వేగంతో దాటుతుండగా, తన బైక్( Bike ) స్కిడ్ అయింది. దీంతో బైక్ రైలు పట్టాలపై పడిపోయింది. అంతలోనే రైలు వేగంగా దూసుకువచ్చి అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని గ్రేటర్ నోయిడా( Greater Noida ) పరిధిలో చోటు చేసుకుంది.
ఈ నెల 12వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3.05 గంటలకు ఓ యువకుడు రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌పై వేగంగా దూసుకువచ్చాడు. దీంతో అతని బైక్ స్కిడ్ అయిపోయి రైలు పట్టాలపై పడింది. అదే సమయంలో పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తుంది. ఆ శబ్దం విన్న యువకుడు తన బైక్‌ను లేపి పట్టాల పక్కకు తీసే లోపు రైలు దూసుకొచ్చింది. దీంతో తన ప్రాణాలైన కాపాడుకుందామని రైలు పట్టాల పక్కకు పరుగెత్తే లోపే రైలు ఆ యువకుడిని ఢీకొట్టింది. యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుధ్ నగర్ పరిధిలోని దతవాళి గ్రామానికి చెందిన తుషర్(22)గా రైల్వే పోలీసులు గుర్తించారు. అతి వేగం, నిర్లక్ష్యం వల్లే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని రైల్వే పోలీసులు తేల్చారు.
देखिये जल्दबाजी का नतीजा कितना खतरनाक है, ग्रेटर नोएडा में रेलवे फाटक पर बाइक फिसलने से युवक ट्रैक पर गिर गया और ट्रेन की चपेट में आकर उसकी मौत हो गई। सुरक्षा नियमों की अनदेखी की कीमत इतनी भारी चुकानी पड़ी । pic.twitter.com/YpBIC8g6Gf
— गुरु प्रसाद यादव, लखनऊ (@guruprasadyada5) October 13, 2025