Chicken Curry | శివ‌రాత్రి తెచ్చిన తంటా.. కోడి కూర వండ‌లేద‌ని ఉరేసుకున్న భ‌ర్త

Chicken Curry | కోడి కూర తినాలకున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి చికెన్‌ను తీసుకెళ్లాడు. కానీ భార్య కోడి కూర వండ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన భ‌ర్త‌.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Chicken Curry | కోడి కూర తినాలకున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి చికెన్‌ను తీసుకెళ్లాడు. కానీ భార్య కోడి కూర వండ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన భ‌ర్త‌.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మేడిప‌ల్లి పీఎస్ ప‌రిధిలోని ప్ర‌తాప్ సింగారం న్యూవెంచ‌ర్‌లో దాస‌రాజుల ప్ర‌కాశ్‌(66) త‌న భార్య‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. ప్ర‌కాశ్ డిఫెన్స్ విశ్రాంత ఉద్యోగి. అయితే ఈ నెల 15వ తేదీన ప్ర‌కాశ్ ఇంటికి చికెన్ తీసుకొని వచ్చి కూర వండాల‌ని భార్య ప‌ద్మ‌(65)ను ఆదేశించాడు. శివ‌రాత్రి కావ‌డంతో.. ఇదొక్క పూట చికెన్ వ‌ద్దు.. త‌ర్వాత చేస్తా అని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో ఆగ్ర‌హావేశాల‌కు లోనైన భ‌ర్త‌.. భార్య‌పై రుసరుస‌లాడాడు. ప‌ద్మ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది.

కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చి చూసేసరికి భర్త సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికుల సాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి అల్లుడు మహేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Latest News