Chicken biryani with potatoes | ‘ఆలూ చికెన్ బిర్యానీ’.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తింటారు..!
Chicken biryani with potatoes | రెగ్యులర్‌గా చికెన్ కర్రీ( Chicken Curry ), చికెన్ ఫ్రై( Chicken Fry ) చేసి బోర్ కొట్టిందా..? అయితే ఈ ఆదివారం ఆలూ చికెన్ బిర్యానీ( Chicken biryani with potatoes ) ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తింటారు.
Chicken biryani with potatoes | నాన్ వెజ్ ప్రియులకు( Non Veg Lovers ) సండే( Sunday ) వచ్చిందంటే.. పండుగే. ఎందుకంటే ఏదో ఒక నాన్ వెజ్ వంటకాన్ని ఆరగిస్తుంటారు. అయితే ఈ వంటకాల్లో వెరైటీలు కోరుకునే వారు చాలా మందినే ఉంటారు. ప్రతి ఆదివారం ఏదో ఒక వెరైటీతో నాన్ వెజ్‌ను రెడీ చేసుకుంటారు. ఈ సండే చికెన్ వెరైటీల్లో ఆలూ చికెన్ బిర్యానీ( Chicken biryani with potatoes ) ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోవడం ఖాయం.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం. ఈ వెరైటీ తిన్న తర్వాత ఆహా ఏమి రుచి అనడం కూడా ఖాయం. మరి ఆలూ చికెన్ బిర్యానీ( Aloo Chicken Biryani ) ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆలూ చికెన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు:
చికెన్ – అర కిలో, సగం ఉడికిన అన్నం – ఒకటిన్నర కిలో, ఆలుగడ్డలు – 4 లేదా 5 (కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి), దాల్చిన చెక్క – చిన్న ముక్క, యాలకులు – 4 లేక 5, మిరియాలు – తగినన్ని, బిర్యానీ ఆకు – కొద్దిగా, పచ్చిమిర్చి – 8, ఉల్లిపాయ ముక్కలు – 2 కప్పులు, కారం – సరిపడా, నిమ్మరసం – 1 టేబుల్ స్పూను, కొత్తిమీర – 1 కప్పు (కట్ చేసినది), కుంకుమ పువ్వు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు.
ఆలూ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం:
చికెన్‌ను పరిశుభ్రమైన నీటితో కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. బిర్యానీ చేస్తున్నారు కాబట్టి ముందుగానే బియ్యాన్ని సగం ఉడికించి ఒక పాత్రలో ఉంచాలి. ఇక చికెన్ ముక్కలకు కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం దట్టించి ఉంచాలి. మరో పాత్రలో బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టాలి. ఆ వేయించిన నూనెలోనే పచ్చి మిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకులను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పాత్రలోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో కలపాలి. ఇవన్నీ వేగిన తర్వాత.. చికెన్ ముక్కలను ఇందులో వేసి కలపాలి. చికెన్ ముక్కలు కాస్త ఉడకగానే.. అందులో ఆలుగడ్డ ముక్కలను వేసి ఉడికించాలి.
అనంతరం సగం ఉడికిన అన్నాన్ని రెండు భాగాలు చేసుకోవాలి. అందులో ఒక భాగంపై అంతకు ముందు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని లేయర్‌లా పరుచుకోవాలి. మళ్లీ అన్నం రెండో భాగం దానిపై పరచాలి. దానిపై మళ్లీ మిగతా కూరను కూడా పరచాలి. అనంతరం కుక్కర్‌లో 1 లేదా 2 విజిల్స్ మాత్రమే వచ్చే వరకు ఉంచి దింపాలి. చివరిగా అన్నంపై కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఆలూ చికెన్ బిర్యానీ తయారవుతుంది. దాన్ని అలాగే తినవచ్చు. లేదా మిర్చీ కా సాలన్, రైతాలతో ఆస్వాదించవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram