Chicken Fry | బ్యాచిల‌ర్స్ స్పెష‌ల్ ‘చికెన్ వేపుడు’.. ట్రై చేయండిలా.. టేస్ట్ అదిరిపోద్ది..

Chicken Fry | అంద‌రూ ఎంతో ఇష్టంగా ఆర‌గించే చికెన్‌( Chicken )ను ర‌క‌ర‌కాలుగా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ క‌ర్రీ( Chicken Curry ), ఫ్రై( Chicken Fry ), చికెన్ 65, చికెన్ మంచురియా.. ఇలా ఎన్నో వెరైటీలు చేయొచ్చు. కానీ బ్యాచిల‌ర్స్ చికెన్ వేపుడు( Chicken Fry ) మాత్రం క్ష‌ణాల్లో త‌యార‌య్యే వంట‌కం. ఇలా ట్రై చేశారంటే టేస్ట్ అదిరిపొద్ది.

Chicken Fry | బ్యాచిల‌ర్స్ స్పెష‌ల్ ‘చికెన్ వేపుడు’.. ట్రై చేయండిలా.. టేస్ట్ అదిరిపోద్ది..

Chicken Fry | ఆదివార‌మే నాన్ వెజ్( Non Veg ) తినాల‌నే రూల్ లేదు. ఎప్పుడు తినాల‌పిస్తే అప్పుడు ఆర‌గించొచ్చు. ఈ స్టైల్ ఎక్కువ‌గా బ్యాచిలర్స్ రూమ్‌ల్లో( Bachelor Rooms ) క‌నిపిస్తుంటుంది. కానీ ఓ గృహిణి చేసినంత అద్భుతంగా మాత్రం బ్యాచిల‌ర్స్ వంట చేయ‌లేరు. ఎందుకంటే స‌రిప‌డా ఇంగ్రీడియంట్స్ బ్యాచిల‌ర్స్ వ‌ద్ద ఉండ‌వు కాబ‌ట్టి. అయినా స‌రే.. చికెన్ క‌ర్రీ( Chicken Curry )ని మాత్రం బ్యాచిల‌ర్స్ ఘుమ‌ఘుమ‌లాడిస్తారు. ఇంకా త‌క్కువ ఇంగ్రీడియంట్స్‌తో క్ష‌ణాల్లో త‌యారు చేసే వంట‌కం.. చికెన్ వేపుడు( Chicken Fry ). ఈ వంట‌కాన్ని బ్యాచిల‌ర్స్ స్పెష‌ల్‌గా చెప్పొచ్చు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ సండే ట్రై చేయండి చికెన్ వేపుడు.. టేస్ట్ అదిరిపోద్ది.

చికెన్ వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్..

అరకేజీ – చికెన్
నూనె – 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు(తగినంత)
రెండు రెమ్మలు – కరివేపాకు
నాలుగు – పచ్చిమిర్చి
రెండు టీస్పూన్లు – అల్లంవెల్లుల్లి పేస్ట్
అరటీస్పూన్ – పసుపు
రుచికి సరిపడా – ఉప్పు
మీడియం సైజ్ ఉల్లిపాయలు – రెండు
ఒకటి – టమాటా
రుచికి తగినంత – కారం
ఒకటీస్పూన్ – ధనియాల పొడి
అరటీస్పూన్ – గరంమసాలా
అరటీస్పూన్ – జీలకర్ర పొడి
కొద్దిగా – సన్నని కొత్తిమీర తరుగు
జీడిపప్పు పలుకులు – కొన్ని(ఆప్షనల్)

చికెన్ వేపుడు త‌యారీ విధానం ఇలా..

ముందుగా అర కేజీ చికెన్‌ను శుభ్రంగా క‌డ‌గాలి. ఇక ట‌మాటా, ఉల్లిపాయ‌ల‌ను స‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి. ప‌చ్చిమిర్చిని నిలువుగా క‌ట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆ త‌ర్వాత స్టౌవ్ వెలిగించి, ఒక పాత్ర‌ను ఉంచాలి. దాంట్లో త‌గినంత నూనె పోసి కాస్త వేడి చేయాలి. అప్ప‌టికే క‌ట్ చేసి పెట్టుకున్న ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి గోల్డెన్ క‌ల‌ర్‌లోకి వ‌చ్చే వ‌ర‌కు వేడి చేయాలి. ఆ త‌ర్వాత శుభ్రంగా చేసుకున్న చికెన్‌ను ఆ పాత్ర‌లో వేయాలి. చికెన్‌ను బాగా క‌ల‌పాలి.

స్టవ్​ను మీడియం టూ హై ఫ్లేమ్​కి అడ్జస్ట్ చేసుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపి వేయించాలి. అలా చికెన్​ని వేయించుకున్నాక అందులో రుచికి తగినంత ఉప్పు క‌ల‌పాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.

లో ఫ్లేమ్‌లో ఉంచి, మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ ఒక ప‌ది నిమిషాల పాటు నెమ్మ‌దిగా వేయించుకోవాలి.
ఇలా చేయ‌డంతో ముక్క అనేది గట్టి పడకుండా సాఫ్ట్​గా ఉండడమే పైన ఎర్రగా బాగా వేగుతుందని గుర్తుంచుకోవాలి. పది నిమిషాల అనంతరం మూత తీసి చూస్తే ఉల్లిపాయ, టమాటా చక్కగా ఉడికి, చికెన్ ఎర్రగా వేగి కనిపిస్తుంది. అనంతరం మీరు తినే రుచికి తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఆపై అవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా సన్నని సెగ మీదనే మరో మూడ్నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక చివర్లో సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, బ్యాచిలర్స్​తో పాటు ఎవరైనా చాలా సింపుల్​గా చేసుకునే కమ్మని “చికెన్ వేపుడు” మీ ముందు ఉంటుంది! టేస్ట్ అదిరిపోద్ది.. లోట్ట‌లేసుకుంటూ ఆర‌గించొచ్చు.