Chicken Fry | సండే.. నాన్ వెజ్ వంటకాలతో ఘుమఘుమలాడిపోతోంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ వంటకం ఉంటుంది. రకరకాల వేరైటీలతో నాన్ వెజ్‌ను వండేసి.. హాయిగా ఆరగిస్తుంటారు. అయితే వెల్లుల్లి కారంతో చికెన్ వేపుడు ఎప్పుడైనా ట్రై చేశారా..? వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకుని తింటే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుంది.
Chicken Fry | సండే.. నాన్ వెజ్ వంటకాలతో ఘుమఘుమలాడిపోతోంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ వంటకం ఉంటుంది. రకరకాల వేరైటీలతో నాన్ వెజ్‌ను వండేసి.. హాయిగా ఆరగిస్తుంటారు. అయితే వెల్లుల్లి కారంతో చికెన్ వేపుడు ఎప్పుడైనా ట్రై చేశారా..? వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకుని తింటే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. కడుపు నిండా తింటాం. మరి వెల్లుల్లి కారంతో చికెన్ వేపుడు చేశారనుకోండి.. ఒక్క ముక్క కూడా మిగలదు. ఇక ఈ వంటకాన్ని సాయంత్రం వేళ స్నాక్స్ మాదిరి తినేయొచ్చు. చపాతీ కాంబినేషన్‌లో కూడా అదిరిపోతుంది. మరి వెల్లుల్లి కారంతో చికెన్ వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మొదట వెల్లుల్లి కారాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఈ కారం పొడి తయారీకి 12 దాకా వెల్లుల్లి రెబ్బలు, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, అరస్పూన్ జీలకర్ర, అర స్పూను మిరియాలు, రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ కారం పొడి రెడీగా ఉంచుకోవాలి. వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక ఈ పొడిని ఒక జార్లో వేసి ఉంచుకోవాలి. అయితే వెల్లుల్లి కారంతో చేసే చికెన్ వేపుడు కోసం… ఈ వెల్లుల్లి కారంలో కాస్త నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే వెల్లుల్లి కారం మిశ్రమం రెడీ అయినట్టే. ఇప్పుడు దీంతో చికెన్ వేపుడు ఎలా చేయాలో చూద్దాం.
చికెన్ – అరకిలో
ఉల్లిపాయ – ఒకటి
టమోటా – ఒకటి
కరివేపాకులు – గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూను
నీరు – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – అర స్పూను
మొదటగా స్టవ్ వెలిగించి.. ఓ పాత్ర పెట్టాలి. అందులో సరిపోయినంత నూనె పోసి మరిగించాలి. శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను నూనెలో వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి కలపాలి. అనంతరం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేయాలి. చికెన్ ముక్కలకు ఈ పేస్టు అంటుకునేలా కలపాలి. చికెన్‌లో నీరంతా ఇంకిపోయి ముక్కలు పొడిపొడిగా ఉన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్టును వేసి బాగా కలపాలి. దాన్ని మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చివరలో తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. అవసరమనుకుంటే నిమ్మరసం వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ వేపుడును వేడివేడిగా ఆరగిస్తే రుచి అదిరిపోతోంది.
వెల్లుల్లితో చేసిన చికెన్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. వెల్లుల్లిలోని సుగుణాలు, చికెన్ లోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. మధుమేహులు వెల్లుల్లితో చేసిన వంటకాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. శరీర బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది వెల్లుల్లి. ఇక చికెన్ తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా శరీరానికి అందుతుంది. వారానికి రెండు సార్లు చికెన్ తినడం వల్ల ప్రొటీన్ లోపం రాకుండా ఉంటుంది.