Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు( Downpour ) కురుస్తుండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం నాడు హనుమకొండ, వరంగల్, జనగామ, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మలాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.