YouTuber Death: రీల్స్..సెల్ఫీల పిచ్చి..వ్యూస్ కోసం యువత చేస్తున్న సాహసాలు అనేక సందర్భాల్లో వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. అయినా యువతలో అలాంటి దుస్సాహాసాలకు దూరంగా ఉండాలన్న విచక్షణ కొరవడుతుంది. తాజాగా ఓ యూ ట్యూబర్(YouTuber) జలపాతం(Waterfalls Accident)లో రీల్ వీడియో కోసం ప్రయత్నించే క్రమంలో అదే ప్రవాహంలో కొట్టుకపోయి ప్రాణాలు(Death) పోగొట్టుకున్న విషాద ఘటన అందరిని కలిచివేసింది. ఈ దుర్ఘటన ఒడిశా(Odisha) లోని కొరాపుట్ జిల్లా డుడుమా జలపాతం(Duduma Waterfalls ) వద్ద చోటుచేసుకుంది. జలపాతం అందాలను డ్రోన్ కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో..యూట్యూబర్ సాగర్ కుందు(22) తను కూడా సెల్ ఫోన్ చేతపట్టుకుని జలపాతం నీళ్లలోకి వెళ్లిపోయాడు.
జలపాతంలోని బండరాళ్లపై నిల్చుని వీడియో చేస్తున్న క్రమంలో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగిపోయింది. అంతే వీడియో తీస్తున్న యూ ట్యూబర్ ఆ నీటి ఉదృతి ప్రవాహంలో చిక్కుకున కొట్టుకపోయాడు. అక్కడే ఉన్న అతడి ఫ్రెండ్స్ కాపాడేందుకు తాళ్లు అందించి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జలపాతం నీటి ప్రవాహ ఉదృతిలో తమ కళ్ల ముందే చూస్తుండగానే..ఆ యువకుడు గల్లంతయ్యాడు. తోటి మిత్రుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో అతని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, మచ్ కుంద్ పోలీసులు యువకుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఎగువన ఉన్న జలాశయం నుంచి నీటి విడుదల చేస్తున్నట్లుగా ముందస్తు సైరన్ ఇవ్వకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వీడియో కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్న యూట్యూబర్
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, డుడుమా జలపాతం వద్ద ఘటన
జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో..
ఫోన్ చేత పట్టుకొని నీళ్లలోకి వెళ్లిపోయిన ఒక యూట్యూబర్
వీడియో తీస్తున్న టైంలో.. ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం
అక్కడే… pic.twitter.com/YuNPWbpuB7
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 24, 2025