Ponguleti Srinivas Reddy| మంత్రి పొంగులేటిని కలిసిన రెవెన్యూ ఉద్యోగులు

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy)ని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు(Revenue Employees Leaders) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీసిఎల్ఏ లో రెవెన్యూ ఉన్నతాధికారులతో శాఖాపరమైన సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమక్షంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డీసీఏ, టీజీటీఏ, టిజీఆర్ఎస్ఏ నేతలు కలిశారు.పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.

రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లుగా మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రిని కలిసిన వారిలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, కోశాధికారి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News