Telangana Police logo| పోలీస్ వాహనాలకు “తెలంగాణ పోలీసు” స్టిక్కర్లు

తెలంగాణ పోలీసులు తమ వాహనాలపై “తెలంగాణ రాష్ట్ర పోలీసు” స్థానంలో “తెలంగాణ పోలీసు” స్టిక్కర్లను అంటిస్తూ ఆధునీకరిస్తున్నారు. స్టిక్కర్ భర్తీ, పాలిషింగ్, డెంటింగ్, పెయింటింగ్‌తో సహా 188 వాహనాలకు రూ1.6 కోట్లు ఖర్చు చేశారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్(Telangana Police) శాఖ వాహనాలకు (Police Vehicles)  కొత్త అధికారిక లోగోలు(New logo Stickers) వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు టీఎస్ నుండి టీజీ పేరు మార్పుకు అనుగుణంగా “తెలంగాణ పోలీసు” స్టిక్కర్లను అంటిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసులు తమ వాహనాలపై “తెలంగాణ రాష్ట్ర పోలీసు” స్థానంలో “తెలంగాణ పోలీసు” స్టిక్కర్లను ఉంచారు.

స్టిక్కర్ భర్తీ, పాలిషింగ్, డెంటింగ్, పెయింటింగ్‌తో సహా 188 వాహనాలకు రూ1.6 కోట్లు ఖర్చు చేశారు. నేడు 134 పెట్రోల్ కార్లు కొత్త లుక్‌తో తిరిగి విధుల్లో చేరాయి. తెలంగాణ పోలీస్ పేరు మార్పు వాహనాలతో పాటు బ్యాడ్జీలు, క్యాప్ లు, బెల్టులపై కూడా వర్తిస్తుంది.