Site icon vidhaatha

బస్సు, కారు ఎదురెదురుగా ఢీ.. 11 మంది దుర్మరణం

విధాత‌: మధ్యప్రదేశ్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బస్సు, కారు ఎదురెదురుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది మరణించారు.

ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Exit mobile version