Site icon vidhaatha

రష్యా ఉగ్రదాడిలో 143కు పెరిగిన మృతులు

మాస్కో: మాస్కోపై ఉగ్రవాదుల దాడి కేసులో సంబంధం ఉన్న మొత్తం నలుగురు సాయుధులు సహా 11 మందిని అరెస్టు చేసినట్టు రష్యా శనివారం ప్రకటించింది. శుక్రవారం రాత్రి క్రాకస్‌ సిటీ­లోని కన్సర్ట్‌ హాల్‌లో ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌­నిక్‌’ సంగీత కార్య­క్రమం నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఉగ్ర­వా­దుల దాడిలో చనిపోయినవారి సంఖ్య 143కు పెరిగింది. మారణహోమానికి తెగబడిన అనంతరం కారులో పరారవుతున్న నిందితులను పోలీసులు ఛేజ్‌ చేసి.. బ్రయాన్స్క్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దాడులకు పాల్పడినవారికి ఉక్రెయిన్‌లో కాంటాక్ట్‌లు కలిగి ఉన్నారని రష్యా భ్రదతా సంస్థలు పేర్కొన్నాయి. వారు సరిహద్దులవైపు వెళుతుండగా పట్టుకున్నట్టు తెలిపాయి. ‘ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే వారంతా రష్యా..ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పోయేందుకు పథకం వేసుకున్నారు. ఉక్రెయిన్‌లో వారికి నిర్డిష్ట కాంటాక్ట్‌లు కూడా ఉన్నాయి’ అని ఫెడరల్‌ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.

అయితే.. ఈ దాడితో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశం ప్రకటించుకున్నది. రష్యా రెచ్చగొట్టుడు చర్యలకు ఇది కారణమై ఉండొచ్చని ఉక్రెయిన్‌ మిలిటరీ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఉదంతం వెనుక మాస్కో స్పెషల్‌ సర్వీసెస్‌ ఉందని ఆరోపించింది.

ఇదిలా ఉంటే.. ఈ దాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ప్రకటించింది. మాస్కో శివార్లలో భారీ జనసమూహంపై తమ ఫైటర్లు దాడి చేశారని, అనంతరం సురక్షితంగా తమ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపింది.

దాడికి పాల్పడిన సాయుధులు మిలిటరీ దుస్తుల్లో వచ్చారు. శుక్ర­వారం రాత్రి క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌­లోకి ప్రవేశించి.. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ.. గ్రనేడ్లు, బాంబులు విసిరారు. దీనితో అనేక మంది అక్కడికక్కడే కుప్పకూలారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు దాడి నుంచి తప్పించుకునేందుకు, సీట్ల వెనుక దాక్కునేందుకు పయత్నించారు. మరికొందరు మెయిన్‌ గేట్లవైపు పరుగులు తీశారు. అర్ధరాత్రి దాటి తర్వాత కాల్పులు ఆగిపోయాయని ఎమర్జెన్సీ మినిస్ట్రీ ప్రకటించింది.

ఉక్రెయిన్‌తో సంబంధం లేదేమో: అమెరికా

మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి, ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధాలు ఉన్నట్టు సత్వర సంకేతాలేమీ కనిపించడం లేదని అమెరికా పేర్కొన్నది. అయితే.. ఈ ఘటనను భయానకమైనదిగా అభివర్ణించింది. భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. గత రెండు దశా­బ్దాల వ్యవధిలో రష్యాపై ఇదే అతి­పెద్ద ఉగ్ర­దాడి.

Exit mobile version