Site icon vidhaatha

OTT Movies | సెప్టెంబ‌ర్ తొలి వారంలో సినీ జాత‌ర‌.. ఏకంగా ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!

OTT Movies |

సెప్టెంబర్‌ నెల హిట్‌ సినిమాతో మొద‌లు కావ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ 1న స‌మంత‌, విజయ్ దేవ‌ర‌కొండ న‌టించిన ఖుషి చిత్రం విడుద‌ల కాగా, ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. ఇక ఇదే జోరుతో ఈ వారం థియేట‌ర్స్ తో పాటు ఓటీటీలో సంద‌డి చేసేందుకు ప‌లు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

ముందుగా ‘నిశ్శబ్దం’ చిత్రం తర్వాత అనుష్క నుండి వ‌స్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది. ఇందులో నవీన్‌ పోలిశెట్టి స్టాండప్‌ కమెడీయన్‌గా, అనుష్క చెఫ్‌ పాత్రలు పోషించారు. ఏడో తేదిన మూవీ రిలీజ్ కానుంది.

ఈ సినిమాకి పోటీగా షారూఖ్ ఖాన్ జ‌వాన్ చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. వీటితో పాటు ప‌లు ఓటీటీ సంస్థలు కూడా తమ ప్లాట్ ఫామ్స్ లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వన్ షాట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లక్కీ గౌ (హిందీ చిత్రం)-సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రజనీకాంత్ జైలర్ మూవీ- సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుండ‌గా, సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇక నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో షేన్ గిల్లీస్ (హాలీవుడ్), స్కాట్స్ హానర్ (హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతన్నాయి. కుంగ్‍ఫూ పాండా (వెబ్ సిరీస్-సీజన్ 3)- సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుండ‌గా, టాప్ బాయ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 7 నుంచి, సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 8 నుంచి , వర్జిన్ రివర్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక ఉరు (మలయాళ చిత్రం)- హైరిచ్- సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఐయామ్ గ్రూట్ (మార్వెల్ మినీ సిరీస్-సీజన్ 2)-డిస్నీ ప్లస్ హాట్‍స్టార్- సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది లిటిల్ మెర్మెయిడ్ (హాలీవుడ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‍స్టార్- సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుంది. హడ్డీ- జీ5- సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది లవ్ (తమిళ చిత్రం)- ఆహా- సెప్టెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్)- బుక్ మై షో- సెప్టెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుండ‌గ‌గా, ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్)- లయన్స్ గేట్ ప్లే- సెప్టెంబర్ 8 నుంచి , ది ఛేంజ్‍లింగ్ (హాలీవుడ్)- ఆపిల్ టీవీ ప్లస్- సెప్టెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తానికి సెప్టెంబ‌ర్ రెండో వారంలో ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందనుంది

Exit mobile version