విధాత: పార్లమెంట్‌లో భద్రతా చర్యలు లోపించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎనిమిది మంది లోక్‌సభ సిబ్బందిని గురువారం సస్పెండ్ చేసింది. రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర అనే ఎనిమిది మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.
మూడంచెల భద్రతా వలయాలను దాటుకొని లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి బుధవారం ఇద్దరు చొరబాటుదారులు లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి పసుపు పొగను వెదజల్లుతున్న రెండు డబ్బాలను పేల్చారు. వారిలో ఒకడు స్పీకర్ కుర్చీ వైపు పరుగెత్తడానికి టేబుళ్ల పైకి దూకాడు.
పార్లమెంటు వెలుపల, మరో ఇద్దరు ఎరుపు, పసుపు రంగుల పొగ బాంబులను పేల్చారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అగంతకులు పార్లమెంట్‌లోకి ప్రవేశం భద్రతా చర్యల్లో పర్యవేక్షణ లోపంగా భావించి ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.