Site icon vidhaatha

Hyderabad | హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ నిందితుల కోసం గాలింపు

Hyderabad

విధాత : హయత్‌నగర్‌లో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం యత్నం కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చేస్తున్నారు.

బాలికను అడ్రస్ అడిగే నెపంతో పిలిచి బలవంతంగా కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోయారు.

బాలిక వారి నుండి తప్పించుకోని సురక్షితంగా ఇంటికి చేరింది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లుగా ఎల్బీ నగర్ డిసిపి తెలిపారు.

నిందితుల నుండి తప్పించుకునే క్రమంలో బాలికకు కొంత గాయాలయ్యాయని తెలిపారు. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరుగలేదన్నారు.

Exit mobile version