విధాత, వరంగల్: స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుళ్లు, సబ్-ఇన్స్స్పెక్టర్ల ఎంపికలో భాగంగా శనివారం మహిళలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో యువతులు అధిక సంఖ్యలో హాజరై తమ సత్తా చాటారు. మూడవ రోజైన శనివారం పోలీస్ నియామక మండలి నిర్దేశించిన మహిళ అభ్యర్థులు ఉదయం ఐదుగంటలకు పరీక్షలు నిర్వహిస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయము మైదానం వద్దకు చేరుకున్నారు.
నేటి నుండి 14వ తేది వరకు నిర్వహిస్తున్న ఈ దేహ దారుఢ్య పరీక్షల్లో మహిళ అభ్యర్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం 800 మీటర్ల పరుగును నిర్వహించారు. ఈ పరుగులో నిర్దేశించిన సమయంలో పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే పోలీస్ అధికారులు తదుపరి ఎత్తు, హైజంప్, లాంగ్లింప్ పరీక్షలు నిర్వహించారు.
నేడు 996 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా ఇందులో 855 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 606మంది అభ్యర్థులు తుది వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్షలను వరంగల్ పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు మౌళిక సదుపాయల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు.