Janhvi Kapoor| విధాత: అలనాటి నటి శ్రీదేవి, నిర్మాతక బోనీ కపూర్ దంపతుల ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. తన హోమ్ టూర్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. చెన్నైలోని తన ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకుంది. శ్రీదేవి నటిగా తన కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో చెన్నైలోనే ఎక్కువగా గడిపేవారు. ఆ సమయంలో చెన్నైలో ఆమె ఓ ఇల్లును కూడా కొనుగోలు చేశారు. తాజాగా ఆ ఇంటిని జాన్వీ హోమ్ టూర్ చేసింది.
ఇంద్ర భవనం లాంటి ఆ నివాసంలో ఎక్కువగా పెయింటింగ్సే దర్శనమిచ్చాయి. శ్రీదేవి, బోనీ కపూర్‌కు సంబంధించిన పలు అరుదైన చిత్రాలను చూపించి, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తనకు ఇష్టమైన జిమ్, డైనింగ్ హాల్, బెడ్రూంను చూపించింది.
అయితే హోమ్ టూర్ చేసిన సందర్భంగా జాన్వీ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటితో తనకు ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి. తన బెడ్రూం బాత్రూమ్‌కు గడియ ఉండదు. లాక్ పెట్టేందుకు అమ్మ ఒప్పుకోక పోవడం తనకు బాగా గుర్తుంది.
బాత్రూంలోకి వెళ్లి అబ్బాయిలతో మాట్లాడతానేమోనన్న భయం అమ్మలో ఉండేది. అందుకే తన బాత్రూమ్ డోర్ లాక్ లేకుండానే ఉండేదని జాన్వీ చెప్పుకొచ్చారు.
ఇంద్ర భవనం లాంటి ఈ ఇల్లు పాత కాలం నాటి సినిమాల్లో సంపన్నుల ఇల్లు మాదిరిగా, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ తో ఉండడం విశేషం. ఇంకేముంది మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.