Site icon vidhaatha

Adipurush | పొరపాటే.. ఆదిపురుష్ రచయిత క్షమాపణలు

Adipurush

విధాత: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆది పురుష్ మూవీ గురించి అడిగినప్పుడు, ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ తాము రామాయణం తీయలేదని, దాని నుండి ప్రేరణ పొందామని చెప్పారు. ఈ ప్రకటనతో నెటిజన్లు ఆయన పై విమర్శలు ఎక్కుపెట్టారు.

దీనిపై తాజాగా రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లా అందరికి క్షమాపణలు చెప్పారు. సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని అంగీకరించారు. నేను చేతులెత్తి అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను అని మనోజ్ ముంతాషిర్ శుక్లా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు.

కాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది.

అలానే ఆదిపురుష్ సినిమా తీసిన విధానం..అందులోని సంభాషణలు…కథనం వంటి వాటన్నింటిపై కూడా జోరుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. తొలుత విమర్శలను తోసిపుచ్చిన రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా ఆలస్యంగానైనా జ్ఞానోదయం పొంది తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఇకనైనా ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాల్సివుంది.

Exit mobile version