Site icon vidhaatha

AirAsia apologizes | గవర్నర్‌కు ఎయిర్ ఏషియా క్షమాపణలు

AirAsia apologizes

విధాత: కర్నాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్‌కు విమాన యాన సంస్థ ఎయిర్ ఏషియా క్షమాపణలు చెప్పింది. ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆయనను ఎక్కించుకోకుండానే టేకాఫ్ అయ్యింది. బెంగుళూర్ నుంచి హైద్రాబాద్ వెళ్లాల్సిన గవర్నర్ విమానశ్రయంలో వీఐపీల లాంజ్ నుంచి టెర్మినల్ 2కు చేరుకునే లోపునే విమానం వెళ్లిపోయింది. దీంతో ఆయన మరో విమానం ఎక్కి 90నిమిషాలు ఆలస్యంగా హైద్రాబాద్‌కు చేరుకున్నారు.

ఈ ఘటనలో సదరు విమానయాన సంస్థ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా గవర్నర్ సిబ్బంది ఎయిర్ పోర్టు అథార్టీకి ఫిర్యాదు చేశారు. జరిగిన తప్పు తెలుసుకున్న ఎయిర్ ఏషియా గవర్నర్‌ను క్షమాపణలు కోరింది. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Exit mobile version