పవన్‌పై పోటీకి రెడీ.. సీనీ నటుడు ఆలీ సంచలన ప్రకటన!

విధాత: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. ఫ్రెండ్షిప్ వేరు.. రాజకీయాలు వేరు.. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమాల పరంగా అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన అలీని అప్పట్లో పవన్ వెంట నడుస్తారనే ఊహాగానాలు వచ్చాయ్.. పవన్ గానీ పార్టీ పెడితే ముందుగా ఆయన వెంట వచ్చేది అలీ అని అనే వారు.. వాస్తవానికి పవన్ టీడీపీతో సన్నిహితంగా ఉండడం..రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే.. అయితే అలీ మాత్రం నేరుగా టీడీపీలో పని […]

  • Publish Date - January 17, 2023 / 11:10 AM IST

విధాత: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. ఫ్రెండ్షిప్ వేరు.. రాజకీయాలు వేరు.. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమాల పరంగా అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన అలీని అప్పట్లో పవన్ వెంట నడుస్తారనే ఊహాగానాలు వచ్చాయ్.. పవన్ గానీ పార్టీ పెడితే ముందుగా ఆయన వెంట వచ్చేది అలీ అని అనే వారు.. వాస్తవానికి పవన్ టీడీపీతో సన్నిహితంగా ఉండడం..రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే..

అయితే అలీ మాత్రం నేరుగా టీడీపీలో పని చేశారు, ప్రచారమూ చేశారు. కానీ కాలచక్రం ఒకేలా ఉండదు కదా.. గిర్రున తిరుగుతుంది.. అలీ ఇటు వైసీపీ వైపు వచ్చేసి 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇక పవన్ సొంత పార్టీని నడుపుతూ అటు టీడీపీతో స్నేహం చేస్తూ వస్తున్నారు. దీంతో ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి అలీ.. పవన్ రాజకీయంగా వైరిపక్షాలుగా మారిపోయారు.

అలీ కాస్త ప్రభుత్వ సలహాదారుగా మారారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఆయన్ను జగన్ సలహాదారుగా నియమించారు. ఆమధ్య ఆలీ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు సైతం జగన్ గుంటూరు వెళ్లారు. టికెట్ రేట్ల పెంపు విషయమై సినీ పెద్దలు ఆమధ్య జగన్ దగ్గరకు వచ్చి చర్చలు జరపగా ఆ సమయంలోనూ అలీ అక్కడ ఉన్నారు. మొత్తానికి ఆలీకి జగన్ తగిన గుర్తింపును ఇస్తున్నారని చెప్పాలి.

దీంతో ఆలీకి సైతం ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం మొదట్నుంచీ ఉన్నప్పటికీ ఇంతవరకూ ఆ అవకాశం రాలేదు. ఈసారి ఎలాగైనా టికెట్ తెచ్చుకునే లక్ష్యంతో ఉన్న ఆలీ తనకు అవకాశం ఇస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ మీద అయినా సరే పోటీకి సిద్ధం అంటున్నారు.

మంత్రి రోజాకు చెందిన నగరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న అలీ తనకు పోటీ చేసే అవకాశం వస్తే పవన్ మీద నిలబడి సత్తా చూపుతానని, అయితే తనను అధిష్టానం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి అని అన్నారు. ఆలీ ఆశలు అయితే బాగానే ఉన్నాయి మరి జగన్ మనసులో ఏముందో.. అలీని ఎక్కడ ఎలా ప్రయోగిస్తారో.. ఎలా ఉపయోగిస్తారో చూడాలి.. మరి పవన్ ఎక్కడ పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ కూడా లేదు.