Site icon vidhaatha

Danny Masterson | నటుడు డానీ మాస్టర్‌సన్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష..! కోర్టులోనే కన్నీరుపెట్టుకున్న అమెరికన్‌ స్టార్‌..!

Danny Masterson |

ప్రముఖ అమెరికన్‌ నటుడు డానీ మాస్టర్‌సన్‌కు 30 సంవత్సరాలు జైలుశిక్ష పడింది. ఇద్దరు మహిళలను అత్యచారం చేసిన కేసులో డానీ మాస్టర్‌సన్‌కు న్యాయమూర్తి గురువారం జైలుశిక్షను విధించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలు 2001, 2003 మధ్య ఈ ఘటనలు జరిగాయి.

గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతుండగా.. నటుడు డానీ మాస్టర్సన్ తన హాలీవుడ్ హిల్స్ ఇంటిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో బుధవారం దోషిగా తేల్చింది. ఇద్దరు మహిళల వాంగ్మూలాలను విన్న తర్వాత లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. మీ టూ ఆరోపణల్లో నటుడిపై ఆరోపణలు వచ్చాయి.

డానీ మాస్టర్‌సన్‌పై తొలిసారి 2001లో 23 సంవత్సరాల మహిళ ఆరోపణలు చేసింది. 2003, ఏప్రిల్‌లో రెండోసారి 28 ఏళ్ల మహిళ.. మూడోసారి 2003 అక్టోబర్‌ – డిసెంబర్‌ మధ్య మూడోసారి ఆరోపణలు వచ్చాయి. డానీ తనను హాలీవుడ్‌ హిల్స్‌ ఇంటికి ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.

డానీ మాస్టర్సన్‌ 1998-2006 వరకు టెలివిజన్‌ కామెడి షో ‘దట్‌ 70s షో’ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత నటుడిపై ఆరోపణలు రావడంతో నెట్‌ఫ్లిక్స్‌ షో ‘ది రాంచ్‌’ నుంచి తొలగించారు. అయితే, లైంగిక దాడి కేసులో విచారణ సందర్భంగా తాను నిర్దోషినని పేర్కొన్నాడు.

సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టు దోషిగా తేలుస్తూ శిక్షను ఖరారు చేసింది. న్యాయమూర్తి తీర్పును వెలువరించిన సమయంలో డానీ మాస్టర్సన్‌ కన్నీరు మున్నీరయ్యాడు.

Exit mobile version