Site icon vidhaatha

Papalpreet Singh | పోలీసులకు చిక్కిన అమృత్‌పాల్‌ గురువు.. పపల్‌ప్రీత్‌సింగ్‌

విధాత : ఖలిస్థాన్‌ వేర్పాటువాది.. ప్రస్తుతం పరారీలో ఉన్న అమృత్‌పాల్‌సింగ్‌కు మెంటార్‌గా భావిస్తున్న పపల్‌ప్రీత్‌సింగ్‌ (Papalpreet Singh) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు జలంధర్‌లో చుట్టుముట్టినప్పుడు అమృత్‌పాల్‌సింగ్‌, పపల్‌ప్రీత్‌సింగ్‌లు కలిసికట్టుగా పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి వేర్వేరు మార్గాల్లో తిరుగుతూ హోషియార్‌పూర్‌కు చేరుకున్నారని తెలుస్తున్నది.

విశ్వసనీయ సమాచారం అందుకున్న పంజాబ్‌ పోలీసులు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు పపల్‌ప్రీత్‌ను సోమవారం అరెస్టు చేశారు. అమృత్‌పాల్‌సింగ్‌కు గురువుగా ఉన్న పపల్‌కు పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వీరిద్దరూ మార్చి 18 నుంచి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి వాహనాలు మార్చుతూ, వేషాలు మార్చుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు

Exit mobile version