Site icon vidhaatha

Anasuya Bharadwaj Vs Vijay Devarakonda | అనసూయ విజయ్‌ను మళ్లీ కెలికింది.. మంట మొదలైంది

Anasuya Bharadwaj Vs Vijay Devarakonda

అనసూయ ఉండచోట ఉండదు. మరీ ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆమెను ఏం చేశాడో.. ఏ సినిమాలో ఆమెకు ఛాన్స్ లేకుండా, రాకుండా చేశాడో తెలియదు కానీ.. అతని పేరు చెబితే.. తోక తొక్కిన త్రాచులా ఆమె విరుచుకుపడుతోంది. ఇంతకు ముందు కూడా రౌడీ హీరోపై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసి.. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగేలా చేసింది. ఇప్పుడు మరోమారు విజయ్ దేవరకొండ అండ్ ఫ్యాన్స్‌ని కెలికింది. వాస్తవానికి ఆమె పాయింట్ అవుట్ చేసిన దానిలో విషయం ఉంది కానీ.. ఆమె రియాక్ట్ అయిన తీరుకే నెటిజన్లలో మరీ ముఖ్యంగా విజయ్ అభిమానులలో మంట మొదలైంది. ఆ మంట ఇప్పుడు కార్చిచ్చులా మారుతోంది.

అసలేం జరిగిందంటే.. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఖుషి’. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల కాబోతోందంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘లైగర్’తో ఏదో పొడిచేసినట్టు‌గా ఆ పోస్టర్‌లో ‘ది విజయ్ దేవరకొండ’ (The Vijay Deverakonda) అని విజయ్ పేరును ముద్రించారు.

వాస్తవానికి ‘ది’ (The) అనే పదాన్ని ఇంగ్లీష్‌లో ఎటువంటి సందర్భాలలో వాడుతారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఏం సాధించాడని విజయ్ పేరు ముందు దానిని చేర్చారు అనేలా.. అనసూయ ఆ పదాన్ని పాయింట్ అవుట్ చేసింది.

ఆ పోస్టర్ విడుదల తర్వాత. ‘‘ఇప్పుడే ఒకటి చూశాను.. ‘ది’ అని పెట్టుకుంటారా?.. బాబోయ్ పైత్యం.. ఏ చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’’ అని ఓ ట్వీట్ చేసింది. ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గురించే అని.. ఆమెపై విజయ్ ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అవుతూ.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆ కామెంట్స్ చూసిన అనసూయ మరో ట్వీట్‌లో.. ‘‘భలే రియాక్ట్ అవుతున్నారుగా.. దొంగనా డ్యాష్.. బంగారుకొండలంట.. ఎక్కడో అక్కడ నేను చెప్పింది నిజం అనేది నిరూపిస్తూనే ఉన్నందుకు థ్యాంక్యూ’’ అని పోస్ట్ చేసింది. దీంతో మరింతగా విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

ఆంటీ అంటూ అడ్డగోలు మాటలతో ఆమెను సోషల్ మీడియాలో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అయినా కూడా అనసూయ వెనక్కి తగ్గలేదు. ఓ అభిమాని తన గురించి అసభ్యకరంగా వేసిన ట్వీట్‌కి తన అభిమాని ఇచ్చిన రిప్లయ్‌తో సహా పోస్ట్ చేసి.. ‘నా ఫ్యాన్ పేజ్ అడ్మిన్‌ల గురించి నాకు తెలియదు. వారికి థ్యాంక్స్ చెప్పను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇతరుల్లా కాకుండా నా ప్రభావం చాలా మందిపై ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ తన తరపున రియాక్ట్ అవుతున్న వారందరికీ బూస్ట్ ఇచ్చింది.

ఆ తర్వాత.. మరో ట్వీట్‌లో.. ‘‘అభిమానులనే వారు చేస్తున్న ఈ రచ్చను ఆపడానికి.. ఏ స్టార్ హీరో వకల్తా ఎందుకు తీసుకోరు? బాధ్యత నుంచే గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టే.. నా వంతు ప్రభావం చూపించగలుగుతున్నాను. ఇతరులను విమర్శించే అభిమానులు లేకుండా ఉంటేనే మంచిది..’’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version