Site icon vidhaatha

Ssc Revaluation : టెన్త్ ఫలితాల్లో ఫెయిల్.. రివాల్యువేషన్ లో 96 మార్కులు

Ssc Revaluation :  ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన విద్యార్థినికి రీ వాల్యువేషన్ లో 96 మార్కులు రావడం గమనార్హం. దీంతో పదో తరగతి మూల్యాంకనం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన తేజస్విని ఇటీవల వచ్చిన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది.

అన్ని సబ్జెక్టుల్లోనూ 90కి పైగా మార్కులు రాగా సోషల్ స్టడీస్ లో మాత్రం విద్యార్థిని తప్పింది. తాను పరీక్షలు బాగానే రాశానని ఎందుకు ఫెయిల్ అయ్యానో అర్థం కావడం లేదని విద్యార్థిని వాపోయింది. సోషల్ స్టడీస్ లో కేవలం 23 మార్కులే వచ్చాయి.

దీంతో రీ వాల్యువేషన్ చేయించింది. కాగా రీ వాల్యువేషన్ లో తేజస్విని ఈ సబ్జెక్ట్ లో 96 మార్కులు రావడం గమనార్హం. దీంతో మొత్తం మార్కులు 575కు చేరుకున్నాయి. ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకొనెందుకు ఈ నెల 27వరకే అవకాశం ఉందని.. తన కూతురుకి వచ్చిన మార్కులతో ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

 

Exit mobile version