‘తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా’ పురస్కాలకు ద‌ర‌ఖాస్తులు

ఈనెల 30 వరకు దరఖాస్తుల‌ ఆహ్వానం జ‌న‌వ‌రి 8న పుర‌స్కారాల ప్ర‌ధానం విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: పుడమి సాహితీ వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యా, వైద్య, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళా రంగాలలో విశిష్ట కృషి చేసిన.. చేస్తున్నతెలుగు వ్యక్తులకు తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు-2022 లను అందించనున్నట్లు పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి తెలిపారు. పురస్కారాల ఎంపిక కు ఈనెల 30 వరకు దరఖాస్తులు […]

  • Publish Date - December 8, 2022 / 08:27 AM IST
  • ఈనెల 30 వరకు దరఖాస్తుల‌ ఆహ్వానం
  • జ‌న‌వ‌రి 8న పుర‌స్కారాల ప్ర‌ధానం

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: పుడమి సాహితీ వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యా, వైద్య, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళా రంగాలలో విశిష్ట కృషి చేసిన.. చేస్తున్నతెలుగు వ్యక్తులకు తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు-2022 లను అందించనున్నట్లు పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి తెలిపారు.

పురస్కారాల ఎంపిక కు ఈనెల 30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలను జనవరి 8 ఆదివారం ఉదయం 10 గంటలకి నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా పిఠాపురం సంస్థాన రాజవంశీకులు రాజా రావువెంకట మహిపతి రామరత్నారావు బహదూర్, కోలంక సంస్థాన రాజవంశీకులు రాజా రావువెంకటరాజ గోపాలకృష్ణ సూర్యారావు బహదూర్, ప్రముఖ కవి శ్రీనాథ మహాకవి వంశీకులు కావూరి శ్రీనివాస శర్మ, భక్తా రామదాసు పదవ తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు, గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి నాలుగో తరం వారసులు గిడుగు వెంకట నాగేశ్వరరావు, ఏనుగు లక్ష్మణ కవి ఆరవ తరం వారసులు ఏనుగు శివరామ ప్రసాద్, కవయిత్రి మొల్ల 14వ తరం వారసులు మున్నేల్లి శివ శంకరయ్య హాజరవుతున్నారని బాల్ రెడ్డి వెల్లడించారు.

తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారాల వేడుకలను విజయవంతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని కవులు, రచయితలు, కళా, సాహితీ, సాంస్కృతిక రంగాల వారు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.