విధాత: రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సాంకేతిక సలహా మండలి భేటీలో ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ అధ్యక్షతన టీఏసీ సమావేశం జరిగింది.
ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకానికి, చౌటుప్పల్ హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి, ఛనాకా-కొరాట ఆనకట్ట ప్రాజెక్టులకు సంబంధించి సమర్పించిన డీపీఆర్‌లను పూర్తి స్థాయిలో పరిశీలించారు.
ఆ తర్వాతే ఈ రోజు జరిగిన టెక్నికల్ అడ్వజైరీ కమిటీ( టీఏసీ) సాంకేతిక సలహా మండలి సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర జల్ శక్తి శాఖ టీఏసీ ఆమోదం తెలిపింది.