విధాత: అంకితా మహారాణా అలియాస్ అప్సరా రాణి అందానికి ఆర్జీవీనే కాదు.. ఎవ్వడైనా ఫిదా కావాల్సిందే. ‘4 లెటర్స్’ అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అంకితా మహారాణా.. తొలి చిత్రంలోనే అందాల ప్రదర్శనలో డిగ్రీ పుచ్చుకుంది. ఆ సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే.. ఆమె అందాల గురించి మాత్రం అంతా మాట్లాడుకునేలా చేసింది.
ఆ సినిమా హిట్టవ్వలేదు కానీ.. హిట్టై ఉంటే.. అప్పుడే తన ఫేట్ మారిపోయేది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలలో ప్రాధాన్యత లేని పాత్రలలో నటించినా.. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలా పడిందో కానీ.. ఆర్జీవీ కన్నుల్లో పడిందీ అమ్మడు. అంతే ఒక్కసారిగా ఆమె దశా, దిశా మారిపోయింది.
అప్సరా రాణిగా పేరు మార్చుకుని.. ఆర్జీవీ ‘థ్రిల్లర్’ లఘు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ లఘు చిత్రంలో సాధ్యమైనంత తక్కువ దుస్తులలో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే, అక్కడి నుండి ఆర్జీవీ కళ్లే కాదు.. అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. వెంటనే రవితేజ ‘క్రాక్’ చిత్రంలో ‘భూమ్ బద్దల్’ అంటూ ఐటమ్‌తో రెచ్చిపోయిన అప్సరా.. ఆ సాంగ్స్‌కి స్పెషలిస్ట్‌గా మారిపోయింది.
ఆ వెంటనే ‘సీటిమార్’ సినిమాలో మరో ఐటమ్ సాంగ్ ఆమెను వరించింది. సినిమాలలో ఐటమ్ సాంగ్స్‌తో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లను అల్లాడించేస్తోంది. ఆమె ఫొటోలకి వర్మ కితాబివ్వని రోజే లేదు. ‘మా ఇష్టం’ (డేంజర్) అంటూ మరోసారి ఆమెను వర్మ ఫుల్ ఎక్స్‌పోజ్ చేశాడు.
అప్పటి నుంచి చేతిలో సినిమాలు లేకపోయినా.. అప్పరా రాణి పేరు టాలీవుడ్‌లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ వరించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఆమె నటిస్తున్న చిత్రం గురువారం గ్రాండ్‌గా ప్రారంభించారు. ‘తలకోన’ టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పరా.. ఇలా హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.