రోడ్డు ప్రమాదంలో AR SI యాదవరెడ్డి మృతి

విధాత, వరంగల్: ములుగు జిల్లా కేంద్రంలో ఏఆర్ ఎస్ఐ గా పనిచేస్తున్న గంజి యాదవరెడ్డి మంగళవారం అర్ధ రాత్రి జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం విధులు ముగించుకొని హనుమకొండ బస్టాండ్ కి చేరిన ఆర్ఎస్ఐ యాదవరెడ్డి తన ద్విచక్ర వాహనంపై రామ్ నగర్ లోని ఇంటికి వెళుతున్నాడు. ఆ క్ర‌మంలో ఏషియన్ శ్రీదేవి మాల్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన యాదవరెడ్డిని సమీపంలోని ఓ ప్రైవేట్ […]

  • Publish Date - January 11, 2023 / 10:20 AM IST

విధాత, వరంగల్: ములుగు జిల్లా కేంద్రంలో ఏఆర్ ఎస్ఐ గా పనిచేస్తున్న గంజి యాదవరెడ్డి మంగళవారం అర్ధ రాత్రి జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మంగళవారం విధులు ముగించుకొని హనుమకొండ బస్టాండ్ కి చేరిన ఆర్ఎస్ఐ యాదవరెడ్డి తన ద్విచక్ర వాహనంపై రామ్ నగర్ లోని ఇంటికి వెళుతున్నాడు. ఆ క్ర‌మంలో ఏషియన్ శ్రీదేవి మాల్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు.

తీవ్ర గాయాల పాలైన యాదవరెడ్డిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యాదవరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.