Site icon vidhaatha

అషు రెడ్డి అడల్ట్‌.. పూర్తి అంగీకారంతో ఇద్దరం ఆ.. పని చేశాం: వర్మ

విధాత: వ‌ర్మ అంటే వ‌ర్మ‌నే. వ‌ర్మ‌లాగా మ‌రొక‌రు ప్ర‌వ‌ర్తించ‌డం సాధ్యం కాదు. ఆయ‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ చెప్పిన మిర్ర‌రింగ్ ద్వారా మాత్ర‌మే అంతో ఇంతో సాధ్యం. కానీ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ఛాన్స్, ఆయ‌న‌తో చ‌నువుగా ఉండేందుకు ఆయ‌న ప‌ర్మిష‌న్ ఇస్తే క‌దా..! ఎంతైనా వ‌ర్మ గురించి రాయాలంటే అదో కిక్కు. మ‌నం కూడా ఇష్టం ఉంటే చ‌ద‌వండి.. లేకుంటే దొబ్బేయండి అనేస్తాం. ఆ మేజిక్ అలాంటిది.

అందుకే వ‌ర్మ గురించి రాసేట‌ప్పుడు మ‌న ప్ర‌మేయం లేకుండా వేళ్లు కంప్యూట‌ర్‌పై నాట్యం చేస్తూ ఉంటాయి. సరే… విష‌యానికి వ‌స్తే వ‌ర్మ.. రీసెంట్‌గా అషురెడ్డితో చేసిన వీడియో బాగా వైర‌ల్ అయింది. కానీ అభిమానుల ఆవేద‌న కూడా చూడాలి క‌దా…! కింగ్ వంటి వ‌ర్మ ఏంటి? ఏకంగా ప‌దిమంది శాడిస్టుల‌ను కూడా త‌ట్టుకునే వ‌ర్మ పోయి పోయి బొంగులోది… ముక్కు ముఖం తెలియ‌ని అషురెడ్డి వేళ్లు నాక‌డం చూస్తే.. ఎవ‌రికైనా గుండె త‌రుక్కుపోకుండా ఉంటుందా? చెప్పండి.

అది ర‌సిక‌త‌లో భాగంగా వాత్సాయ‌న కామ‌సూత్ర ప్రకారం వేళ్లు నాకాడా? లేక ఆ వేలికి ఏమైనా గాయం అయితే సినిమా లెవ‌ల్లో ఠ‌క్కున ఆ దెబ్బ‌త‌గిలిన‌, ర‌క్తం వ‌స్తోన్న వేలిని నోటిలో పెట్టాడా? అనేది వ‌ర్మ‌ను సృష్టించిన ఆ బ్ర‌హ్మ కూడా వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేడు సుమా…..! దానిపై వివ‌ర‌ణ కావాలంటే మ‌రో వ‌ర్మ‌నే న‌డుంబిగించాలి. అది సాధ్యం కాని విష‌యం కాబ‌ట్టి మ‌న అనుమానాలు నివృత్తి చేయ‌డానికి ఆ వ‌ర్మే మ‌న ముందుకు వ‌చ్చాడు.

ఆయ‌న మాట్లాడుతూ, తాజాగా అషురెడ్డిపై తాను చేసిన వీడియోపై మరో వీడియో చేశాడు వర్మ.. తన మీద వస్తున్న ట్రోలింగ్స్‌కు సమాధానం ఇవ్వడం కోసం దీన్ని చేశాడన్నమాట. తన పనిని వర్మ సమర్ధించు కున్నాడు. కాలి బొటనవేలు చీకడం కరెక్ట్ అని చెప్పాడు. నేను అషు రెడ్డి అడల్ట్‌. పూర్తి అంగీకారంతో ఇద్దరం చేసిన పని అది. మేము మాట్లాడుకున్న మాటలు, నేను చేసిన పనులు పూర్తిగా మా అవగాహన తోనే జరిగాయి. ఇది మా ఇద్దరి మధ్య వ్యవహారం. మిగతా వాళ్ళు చూడొచ్చు.. చూడకపోవచ్చని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. వినోదం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. కొందరు సినిమాలు చూస్తారు… కొందరు పబ్బుకు వెళ్తారు… నేను మాత్రం అందమైన అమ్మాయితో ఇలాంటి ముచ్చట్లు పెడుతూ ఉంటాను. మీకు ఈ సమాజంలో నచ్చనివి వందలు వేలల్లో ఉంటాయి. అన్నింటినీ మీరు ఆపలేరు కదా! ఇది కూడా అలాంటిదే అనుకోండి.. అని చెప్పాడు.

నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. నేను పెట్టిన వీడియోస్ నచ్చకపోతే ఒక్క క్షణంలో అన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేనేం ఫాలోయర్స్ కోసం పాకులాడే రకం కాదు అని కూడా చెప్పాడు కాబట్టి ఇక ఆ వీడియోను, ఆ ఛానల్ ను ఏం చేయాలి అనేది నెటిజన్ల ఇష్టం. ఆల్రెడీ వర్మ దేనికైనా ఓకే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.. అర్థమైందా?

Exit mobile version