Site icon vidhaatha

Hanumakonda | దారుణం.. మందలించాడని అన్నను హత్య చేసిన తమ్ముడు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: క్ష‌ణికావేశంలో అన్న‌ను త‌మ్ముడు న‌రికి చంపిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ‌ కుమార్‌ప‌ల్లిలో జ‌రిగింది. కుమార్‌ప‌ల్లిలోని బుద్ధ‌భ‌వ‌న్ వ‌ద్ద శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో అన్న‌ద‌మ్ములు గొర్రె శంక‌ర్‌, గొర్రె రాజ్‌కుమార్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో అన్న గొర్రె శంకర్‌ను తమ్ముడు గొర్రె రాజ్ కుమార్ గొడ్డలితో న‌రికి దారుణంగా హ‌త్య‌చేశాడు.

కాగా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ అవివాహితుల‌ని, త‌మ్ముడు వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుండ‌టంతో అన్న మందలించాడ‌ని.. ఈక్ర‌మంలోనే కోపంతో అన్న‌ను తమ్ముడు హ‌త్య చేశాడ‌ని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version