Site icon vidhaatha

Nallagandla: చందానగర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

విధాత: చందానగర్‌ పోలిస్టేషన్‌ పరిధిలోని నల్లగండ్లలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త బండ రాయితో మోద‌గా, తప్పించుకొని పరిగెడుతుంటే వెంటాడి, వేటాడి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.

చందానగర్‌ సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాల ప్రకారం పోలీస్టేషన్‌ పరిధిలో నల్లగండ్లలో నివాసముంటున్న అంబిక(27), నరేందర్‌లు భార్యభర్తలు. వీరి స్వస్థలం తాండూరు. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ కుటుంబం నల్లగండ్లలో నివసిస్తోంది. మృతురాలు అంబిక శ్వాస బొటిక్‌ షాప్‌లో పని చేస్తోంది. అంబిక షాప్‌లో పని చేస్తున్న సమయంలో శుక్రవారం ఉదయం 11.40 గంటలకు వచ్చిన అంబిక భర్త నరేందర్‌ బండరాయితో తల‌పై మోదాడు.

ఎవరూ ఊహించని విధంగా భర్త అకస్మాత్తుగా అక్కడి వచ్చి దాడి చేయడంతో బెంబేలెత్తిపోయిన అంబిక భర్త చేసే దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తింది. పరుగెత్తుతున్న అంబికను ఆమె భర్త నరేందర్ వెంటాడి తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే గత ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య జరగుతున్న గొడవల కారణంగానే ఈహత్య చేసినట్లు పోలీసులు ప్రాథ‌మిక ధర్యాప్తులో గుర్తించినట్లు తెలిసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version