విధాత: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
బాహ్య ప్రపంచాని కన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని, అవినాష్‌రెడ్డి ఆ విషయం చెప్పారా? అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నదని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గట్టిగా తన వాదనలు వినిపించింది.
ఇదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును అవినాష్ అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూర్ చేసింది.
ఏబీఎన్, మహాటీవీల ఫుటేజీ ఇవ్వండి
అవినాష్ రెడ్డి బెయిల్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు .
ఈనెల 26న ఏబీఎన్, మహా టీవీ ఛానెళ్లలో జరిగిన పాల్గొని న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేసిన సస్పెండ్ అయిన జడ్జి రామ కృష్ణ మీద తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినాష్ కేసు విషయంలో హైకోర్టు జడ్జీలకు డబ్బు సంచులు వెళ్లాయని, అందుకే అయన అరెస్ట్ కావడం లేదని రామకృష్ణ( గతంలో సస్పెండ్ అయినా జడ్జి) వ్యాఖ్యలు చేసారు.. ఇదంతా ఆ ఛానెళ్లలో ప్రసారం అయింది.
ఈ ఆరోపణలను నేడు కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆ ఛానెళ్లలో జరిగిన చర్చలు, ఆ వీడియో ఫుటేజీ మొత్తం తమ ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను కోర్టు ఆదేశించింది. కేవలం హైకోర్టు న్యాయమూర్తులు డబ్బు సంచులు తీసుకుని అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సీబీఐ నించి కాపాడుతున్నారని ఆరోజు టివి డిబేట్లలో సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేసారు. ఈ చర్చల్లో పాల్గొన్న కొందరు పాత్రికేయులు సైతం రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు భాష్యం చెప్పారు.
అయితే ఈ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు మీడియా అంటే గౌరవం ఉందని, కానీ ఆరోజు తమ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడంతో తాము కలత చెందామని న్యాయమూర్తి ఆవేదన చెందారు. అంతేకాకుండా దీన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఆ వీడియో ఫుటేజీ మొత్తం డౌన్లోడ్ చేసి తమకు ఇవ్వాలని ఆదేశించడం ఇప్పుడు సంచలనం ఐంది