Site icon vidhaatha

మంత్రుల వ్యాఖ్యలు అసత్యం.. అవార్డు అందుకు ఇవ్వలేదు: కేంద్రం

విధాత: తెలంగాణలో మిషన్ భగీరథ పథకంపై ఎలాంటి మదింపు చేయలేదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది. సీఎం కేసీఆర్ మానస పత్రికైన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శమని, జాతీయ జల్ జీవన్ మిషన్ అవార్డు రావడమే దీనికి నిదర్శనమన్న మంత్రుల వ్యాఖ్యలు అసత్యమని పేర్కొన్నది.

గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తాగునీటిని సరఫరా చేస్తున్న కేటగిరీలోనే రాష్ట్రానికి ఈ నెల 2న ఢిల్లీలో అవార్డు ఇస్తున్నామని స్పష్టం చేసింది. తాగునీటి సరఫరా కార్యాచరణ మదింపులో పేర్కొన్న ప్రమాణాల్లో క్రమం తప్పకుండా సరఫరా ఒకటి మాత్రమే అని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ తరఫున మిషన్ భగీరథ పథకంపై వాస్తవ ప్రకటన పేరుతో కేంద్ర సమాచార బ్యూరో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం మదింపు చేయలేదు. జల్షన్ మిషన్ కింద ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల తాగు నీటిని, ప్రమాణాల మేరకు అందిస్తున్నారా? లేదా? విషయమై మదింపు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 400 గ్రామాల్లోని 12,570 కుటుంబాలను శాంపిల్గా పరిగణనలోకి తీసుకున్నాం.

ఇందులో 8 శాతం కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 55 లీటర్ల కన్నా తక్కువగా తాగునీరు అందుతున్నది. మొత్తం శాంపిళ్లలో 5 శాతం కుటుంబాలకు జల జీవన్ మిషన్ ప్రమాణాల మేరకు నాణ్య తతో కూడిన తాగునీరు అందడం లేదని వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం నూరు. శాతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చామని చెబుతున్నా.. గ్రామపంచాయతీల ద్వారా ధ్రువీకరణ పొందలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version