Site icon vidhaatha

అయ్య బాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్ ఓనర్స్ ఉన్నారు. అంతలా బాక్స్‌లు బద్దలు కొట్టేస్తున్నాడు థమన్.

ఆయన తాజాగా సంగీతం అందించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్లా.. ఈ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమాకున్న మెయిన్ హైలెట్స్‌లో థమన్ సంగీతం కూడా ఒకటి.

మాములుగా అయితే ‘గాడ్‌ఫాదర్’ ఒరిజినల్ వెర్షన్ ‘లూసిఫర్’లో సంగీతానికి అంత ప్రాధాన్యత ఉండదు. కానీ ఇక్కడ చిరంజీవి కావడంతో.. థమన్, మోహన్ రాజా స్పేస్ తీసుకొన్నారు. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దడదడలాడించారు. సంగీతం పరంగా ఈ సినిమా చాలా హై రేంజ్‌లో ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఫస్ట్ టైమ్ మ్యూజిక్ చేయడం, ఫస్ట్ సినిమానే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారు. తాజాగా థమన్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. తన సెంటిమెంట్ వర్కవుట్ అయినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ వుంది. నేను ఫస్ట్ టైమ్ కలిసి పని చేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్‌బస్టర్స్ సాధించాయి. మహేష్ బాబుగారితో ‘దూకుడు’, రవితేజగారితో ‘కిక్’, ఎన్టీఆర్ గారితో ‘బృందావనం’, పవన్ కళ్యాణ్‌గారితో ‘వకీల్ సాబ్’, బాలకృష్ణగారితో ‘అఖండ’.. ఇలా అన్నీ బ్లాక్‌బస్టర్స్.

ఇప్పుడు మెగాస్టార్ గారితో నేను చేసిన తొలి సినిమా ‘గాడ్ ఫాదర్’ కూడా బ్లాక్‌బస్టర్. ఆ సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవి‌గారికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం.

మ్యూజిక్‌కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్‌గా హై తీసుకురావడం ఒక పెద్ద సవాల్. సినిమా చూసిన ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది. మెగాస్టార్‌గారు గ్రేట్ లెజండ్. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. చాలా అనందంగా వుంది. ఈ విజయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’’ అని థమన్ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

Exit mobile version