Site icon vidhaatha

Balagam | మానవత్వం చాటుకున్న ‘బలగం’ డైరెక్టర్ వేణు.. బుడిగ జంగాలకు రూ.లక్ష ఆర్థిక సాయం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బలగం సినిమాలో క్లైమాక్స్‌లో బలరామనర్సయ్యో… అంటూ పాటను అద్భుతంగా ఆలపించి కోట్లాదిమందిని ఎమోషనల్‌గా ఆకట్టుకున్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగె జంగాల కళాకారులు పస్తా కొమరవ్వ, మొగిలయ్యలను బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి శుక్రవారం పరామర్శించారు.

మొగులయ్య కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మొగులయ్య దీనస్థితి తెలిసి దుగ్గొండి వెళ్లి మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సహాయం అందిస్తామన్నారు. డయాలసిస్‌తో పాటు ఉచితంగా మందులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కొమరవ్వ మొగిలయ్యలను ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ వేణుతో పాటు మిత్ర బృందం, సిరిసిల్ల నాయకులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, బాలు కాయితి సిరిసిల్ల, దార్ల సందీప్, పెట్టం సుధాకర్, లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల, యాంకర్ గీత భగత్ కలిసి రూ.70 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

మరో రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. మనోధైర్యాన్ని కల్పించారు. వారితో కలిసి భోజనం చేశారు. దుగ్గొండిని సందర్శించిన వేణు బృందాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు సత్కరించారు. నర్సంపేట సిఐ పులి రమేష్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళాకారులు కొమురవ్వ మొగిలయ్యలను అభినందించారు. దుగ్గొండి పేరును ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారని వారిని ప్రశంసించారు.

ఎమ్మెల్యే పెద్ది స్పందన

బుడగ జంగాల కళాకారులైన “పస్తా మొగిలయ్య కొమరమ్మ” ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు ఇటీవల సత్కరించి, అభినందించారు. మొగిలయ్య అనారోగ్య దృష్ట్యా నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించి, మెరుగైన చికిత్స అందించి, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. వారు పాటల ప్రపంచంలో మరింత ప్రజాదరణ పొందాలని కోరుకున్నట్లు తెలియజేశారు.

Exit mobile version