- హిందూపురంలో అన్న క్యాంటిన్లో..
విధాత: బాలయ్యబాబు ఓ వైపు సినిమాలు.. మరోవైపు అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు. రాయలసీమలో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా హిందూపురంలో గెలిచిన బాలయ్య తన పట్టును నిరూపించుకున్నారు.
అయితే గెలిచాక తన నియోజకవర్గంలో సరిగా ఉండడం లేదు.. కార్యకర్తలు, ప్రజలకు దొరకడం లేదన్న ఆరోపణలు ఉంటున్నా ఏదోలా మొత్తానికి మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక హిందూపురంలో బాలయ్య అన్న క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరకే సొంత ఖర్చులతో ప్రజలకు భోజన సౌకర్యాన్ని బాలయ్య అందిస్తున్నారు.
దీంతోబాటు మొబైల్ క్లీనిక్ కూడా నడిపిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ పెట్టి 200 రోజులు పూర్తి కావడం మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కావడంతో రూ.2కే చికెన్ బిర్యానీని బాలకృష్ణ అందుబాటులోకి తెచ్చారు.
అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి బుధవారానికి 200 రోజులు పూర్తి కావడంతో రూ.2కే చికెన్ బిర్యానీ, గుడ్డు, స్వీటును అందించారు. రూ.2 కే చికెన్ బిర్యానీ, స్వీటు, గుడ్డు, అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు బారులు తీరారు.