పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మూవీకి భారీగానే లాభాలు వచ్చాయి. ఇక చిత్రంలో నటించిన పలువురు నటీనటులకి కూడా మంచి పేరు వచ్చింది.
అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పక్కన ఒక లేడీ పోలీస్ మనం చూసే ఉంటాం. ఆమె పేరు మౌనిక రెడ్డి కాగా, చిత్రంలో కీలక పాత్ర పోషించి అలరించింది. ఈ అమ్మడు ఈ చిత్రంలోనే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేసి మెప్పించింది. భీమ్లా నాయక్ చిత్రంలో మౌనిక రెడ్డి ఎమోషనల్ గా ఎంతగానో ఆకట్టుకుంది. తన పర్‌ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించింది.
అయితే మౌనిక రెడ్డి పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ అమ్మడు గత కొంత కాలంగా సందీప్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉండగా, గత ఏడాది గోవాలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిని చూసిన వారందరు జంట చూడముచ్చటగా ఉందని అన్నారు.
అయితే వీరి పెళ్లి అయి ఏడాది కూడా కాకముందే వారు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. అందుకు కారణం మౌనిక రెడ్డి తన సోషల్ మీడియా పేజ్‌లో ఆయనని అన్‌ఫాలో చేసి పెళ్లికి సంబంధించిన ఫొటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసింది. ఇద్దరు కలిసి ఉన్నవి ఏవి లేకుండా డిలీట్ చేయడంతో వీరిద్దరి మద్య మనస్పర్థలు మొదలైనట్లు ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇటీవల సెలబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సమంత,నిహారిక, శ్రీజ వంటి వారు విడాకులకి ముందు ఇన్స్టా లో అన్ ఫాలో చేసుకున్నారు.
ఇప్పుడు మౌనిక కూడా తన భర్త సందీప్ ని అన్‌ఫాలో చేయడంతో ఈ జంట విడిపోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. మరి దీనిపై అధికారిక సమాచారం రావల్సి ఉంది. ఇక మౌనిక రెడ్డికి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తెనాలికి చెందిన ఈ అమ్మడు ఇప్పుడిపుడే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది.