Site icon vidhaatha

Bhuvanagiri | సంకెళ్లతో కోర్టుకు RRR రైతులు.. ఆగ్రహంతో అన్నదాతలు

Bhuvanagiri |

విధాత: రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోతున్న బాధతో న్యాయం కోరుతూ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగిన సందర్భంలో మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్న రాయగిరి రైతులపై కేసులు పెట్టి జైలు పాలు చేసిన పోలీస్ శాఖ మంగళవారం వారిని సంకెళ్లతో జైలు నుంచి తీసుకువచ్చి భువనగిరి కోర్టులో హాజరు పరిచింది.

ఆర్ఆర్ఆర్ నిర్వాసిత నలుగురు రైతులను సంకెళ్లు వేసి పోలీసులు భువనగిరి కోర్టులో హాజరు పరచడం చూసిన రాయగిరి గ్రామ రైతులు అగ్రవేశాలకు లోనయ్యారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై శాపనార్ధాలు పెట్టారు. ఆరుగురు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసు శాఖ వారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చూపి నలుగురిని తొలుత భువనగిరి జైలులో పెట్టారు.

అయితే రాజకీయ నాయకుల పరామర్శల తాకిడి అధికమవ్వడంతో అక్కడి నుంచి నల్గొండ జైలుకు మార్చారు. తమపై ననాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని సవాల్ చేస్తూ రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అటు రైతుల 14 రోజుల రిమాండ్ కూడా ముగియ్యడంతో రైతులను భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. అప్పటికే రైతులకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో వారిని భువనగిరి కోర్టు నుంచి తిరిగి నల్గొండ జైలుకు తరలించి బెయిల్ పై వారిని విడుదల చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Komatireddy Venkat Reddy | రైతులకు సంకెళ్లు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Exit mobile version