ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే: సీఎం కేసీఆర్

విధాత‌: దేశంలో రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎగిరేది గులాబీ జెండానే అని ఆయ‌న తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగ‌ర‌బోయేది గులాబీ జెండానే. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని […]

  • Publish Date - December 9, 2022 / 10:47 AM IST

విధాత‌: దేశంలో రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎగిరేది గులాబీ జెండానే అని ఆయ‌న తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగ‌ర‌బోయేది గులాబీ జెండానే. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తాం. దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింది.

ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు.. రాజ‌కీయ పార్టీలు కాదు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌రం. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాలి. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాలి.

రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తాం. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాలి. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభం అవుతుంద‌న్నారు.