విధాత: ఏడు ప్రాధాన్యతాంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. యువశక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగ బలోపేతం, మౌలిక రంగాభివృద్ధి-పెట్టుబడులు, సమ్మిళిత అభివృద్ధి, ప్రతీ వ్యక్తికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడటం, హరిత వృద్ధి, ప్రజాశక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడం ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి.