UP | త‌న చావుకు కార‌ణ‌మైన వాడిని వెతుక్కుంటూ.. 28 ఏళ్ల త‌ర్వాత‌ వ‌చ్చిన దున్న‌పోతు

విధాత‌: భార‌త‌దేశంలో నేర విచార‌ణ ఎంత సుదీర్ఘంగా సాగుతుందో మ‌రోసారి రుజువు చేసే ఘ‌ట‌న తాజాగా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (UP)లో వెలుగులోకి వ‌చ్చింది. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన 83 ఏళ్ల వ్య‌క్తికి 28 ఏళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి ఇటీవ‌ల నోటీసులు వచ్చాయి. అదేం కేసు అనుకుంటున్నారా.. త‌న వాహ‌నంతో దున్న‌పోతును ఢీకొట్ట‌డంతో అది చ‌నిపోయిన కేసు ఇది. ఇందులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తే ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (uttar Pradesh)కు చెందిన 83 ఏళ్ల అచ్చ‌న్‌. సోమ‌వారం […]

  • Publish Date - June 29, 2023 / 01:30 PM IST

విధాత‌: భార‌త‌దేశంలో నేర విచార‌ణ ఎంత సుదీర్ఘంగా సాగుతుందో మ‌రోసారి రుజువు చేసే ఘ‌ట‌న తాజాగా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (UP)లో వెలుగులోకి వ‌చ్చింది. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన 83 ఏళ్ల వ్య‌క్తికి 28 ఏళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి ఇటీవ‌ల నోటీసులు వచ్చాయి. అదేం కేసు అనుకుంటున్నారా.. త‌న వాహ‌నంతో దున్న‌పోతును ఢీకొట్ట‌డంతో అది చ‌నిపోయిన కేసు ఇది.

ఇందులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తే ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (uttar Pradesh)కు చెందిన 83 ఏళ్ల అచ్చ‌న్‌. సోమ‌వారం అత‌డి ఇంటికి వ‌చ్చిన బ‌రేలీ పోలీసులు.. అచ్చ‌న్‌కు స‌మ‌న్లు అంద‌జేశారు. కొన్ని రోజుల్లో మేజిస్ట్రేట్ కోర్టులో విచార‌ణ‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని అందులో ఉంది. దానిని చ‌ద‌వుతుండ‌గానే పోలీసుల ఎదుట అత‌డు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు.

28 ఏళ్ల క్రితం నాటి కేసును ఇప్పుడు తానెలా ఎదుర్కోగ‌ల‌న‌ని వాపోయాడు. ప్ర‌స్తుతం త‌న‌కు పెరాల‌సిస్ వ్యాధి వ‌చ్చింద‌ని ఒక‌రి తోడు లేకండా బ‌య‌ట‌కు రాలేని స్థితిలో ఉన్నాన‌ని పోలీసుల‌కు తెలిపాడు. ఇందులో తాము కూడా చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని.. కోర్టులో హాజ‌రు కాక‌పోతే చ‌ట్ట‌ ప్ర‌కారం అరెస్టు చేయాల్సి వ‌స్తుంద‌ని పోలీసులు చెప్పి వెళ్లిపోయారు.

అస‌లేం జ‌రిగిందంటే..

ఘ‌ట‌న జ‌రిగిన 1994 ప్రాంతంలో అచ్చ‌న్‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ర‌వాణా శాఖ‌లో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండేవాడు. ‘ఓ రోజు నేను కార్గోను తీసుకోవ‌డానికి బ‌రేలీ వెళ్లాను. అక్క‌డి నుంచి ఫ‌రీదాపూర్‌కు బ‌య‌లుదేరాను. నేను వేగంగా వెళుతుండ‌గా నా వాహ‌నం ముందున్న దున్న‌పోతుల బండి అక‌స్మాత్తుగా ప‌క్క‌కి తిర‌గింది. బ్రేకు వేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వాటి మీద నుంచే నా బండి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక దున్న మ‌ర‌ణించింది’ అని అచ్చ‌న్ గుర్తుచేసుకున్నాడు.

ఈ ప్ర‌మాదంపై తొలి ఎనిమిదేళ్ల‌లో రెండు సార్లు స‌మ‌న్లు అందుకున్నాన‌ని, రెండు సార్లూ బెయిల్ వ‌చ్చింద‌ని తెలిపాడు. 20 ఏళ్లుగా ప‌క్క‌న ఉన్న కేసు ఇప్పుడు మ‌ళ్లీ త‌న త‌ల‌కు చుట్టుకుంద‌ని వాపోయాడు. 28 ఏళ్ల క్రితం చ‌నిపోయిన ఆ దున్న‌పోతు ఇప్ప‌టికీ త‌న‌ను వ‌ద‌ల‌డం లేద‌ని బాధ‌ప‌డ్డాడు.

Latest News