Site icon vidhaatha

Bus Accident | పెళ్లి బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి సమీపాన ప్రైవేటు బస్సు బోల్తా (Bus Accident) పడడంతో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం హైదరాబాదులో పెళ్లికి వెళ్లి తిరుగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌కు ఢీకొనగా బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు పురుషులు 40 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని హుటా హుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version