Site icon vidhaatha

Case Filed On Revanth Reddy | పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

Case Filed On Revanth Reddy | విధాత ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ పోలీసులపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని, వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జిల్లా పోలీసు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా చట్టలకు, న్యాయాలకు లోబడి పనిచేస్తామని, ఎవరో వత్తిడి చేస్తే పనులు చేయమని వారు తెలిపారు.

టీపీపీసీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి పోలీసుల గుడ్డలూడదీసి కొడతామని మాట్లాడం తగదన్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి పై జడ్చర్ల, భూత్పూర్ పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు.

Exit mobile version