MLA Anirudh Reddy Has Given Strong Counter To KTR | కేటీఆర్ వర్సెస్ అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి–కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పోల్యూషన్, పాలన, రైతుల సమస్యలపై ఘాటైన విమర్శలు చేసుకున్నారు.

Anirudh reddy Vs Ktr

విధాత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మధ్య రాజకీయంగా మాటల యుద్దం సాగింది. తన నియోజకవర్గంలో కాలుష్యానికి కారణమవుతున్న పోలెపల్లి సెజ్ లో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీపై అధికారులుచర్యలు తీసుకోకుంటే..కంపెనీని తగులబెడుతానంటూ అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు సంధించారు. స్థానిక సమస్యలు తీర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రికలకెక్కుతాడు అని..భఆరీవర్షాల వల్ల
నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు అని..రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి, పరిశ్రమనే తగులబెడతానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరించి రౌడియిజం చేస్తాడు అని కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో..సర్కారు కాదిది సర్కసే! అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

తన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన విమర్శలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా అంతే స్ట్రాంట్ గా కౌంటర్ ఇచ్చారు. ప్రతిదీ రాజకీయం చేయొద్దంటూ కేటీఆర్ కు హితవుల పలికారు. మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా?.. తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. మా పార్టీలో మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ, మా ప్రభుత్వం పైన ప్రజలకి చిత్తశుద్ధి ఉందన్నారు. మీ పాలన నిరంకుశత్వ పాలన, మీది మీ రౌడీయిజం, అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని బొంద పెట్టారు అని అనిరుధ్ రెడ్డి ఘాటుగా కౌంటర్ చేశారు.

నేను పోరాటం చేసేది రైతుల కోసం.. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమిషన్లు, భూకబ్జాల కోసం అని కేటీఆర్ గమనించాలన్నారు. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. మీ మాజీ ఎమ్మెల్యేలకు ఫ్యాక్టరీలో పొల్యూషన్ వచ్చినా.. వాళ్లకు కమిషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్యపై మాట్లాడలేదని మీరు గుర్తించాలంటూ కేటీఆర్ కు చురకలేశారు.

 

Exit mobile version